Begin typing your search above and press return to search.

గుడ్‌ న్యూస్.. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ ఈ నెల 16న ప్రారంభం!

By:  Tupaki Desk   |   3 Oct 2020 3:30 PM GMT
గుడ్‌ న్యూస్.. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ ఈ నెల 16న ప్రారంభం!
X
బెజవాడ నగర వాసుల కల ఎట్టకేలకి నెరవేరబోతోంది. గత కొన్నిరోజులుగా వేచి చూస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 16న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 16 అక్టోబర్, 2020 తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా జరగనుందని ఆయన ప్రకటించారు.

ఈ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం గత నెల 18న ప్రారంభం కావాల్సినప్పటికీ నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని కేశినేని నాని తెలిపారు. ఆ రోజు దుర్గ గుడి ప్రారంభోత్సవాన్ని సీఎం జగన్‍తో కలిసి వర్చువల్‌ ద్వారా ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మొత్తం రూ.15 వేల 622 కోట్ల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,500 కోట్లతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజ చేయనున్నారు.

మొదటగా దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం గత నెల 4న క‌న‌క‌దుర్గ వంతెనను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూయడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవాన్ని సెప్టెంబర్ 18న ప్రారంభించాలనుకున్నారు. కానీ, అప్పుడు మంత్రికి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో మళ్లీ వాయిదా పడింది. ఫైనల్ గా ఈ నెల 16 న ప్రారంభించనున్నారు.