Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్‌.. అన్ని త‌ప్పులు మీవే: క‌డిగేసిన 'నీతి'

By:  Tupaki Desk   |   7 Aug 2022 2:30 AM GMT
కేసీఆర్ స‌ర్‌.. అన్ని త‌ప్పులు మీవే:  క‌డిగేసిన నీతి
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నీతి ఆయోగ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ``అన్ని త‌ప్పులూ మీరు చేసి.. ఇప్పుడు మాపై ఎందుకు ప‌డ‌తారు? వేల‌కు వేల కోట్ల రూపాయ‌ల‌ను వివిధ ప‌థ‌కాల‌కు మేం కేటాయించాం. కానీ,.. మీరు వంద‌ల కోట్లు కూడా వాడుకోవ‌డం లేదు. అది మాత‌ప్పా.. మీ త‌ప్పా.. ఇచ్చి నిధులు వినియోగించుకోవ‌డం మీకు చేత‌కాలేదు`` అని నీతి ఆయోగ్ క‌డిగేసింది.

తాజాగా సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. నిరర్థక సంస్థగా మారిందని అన్నారు. ఈ వ్యాఖ్యల్ని నీతి ఆయోగ్ తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టామన్న నీతి ఆయోగ్‌... గతేడాదిలో ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించామని తెలిపింది.

2021లో తమ ప్రతినిధి బృందం తెలంగాణ సీఎంను కూడా కలిసిందన్న సంస్థ... ఇటీవల సమావేశం కోసం ఎన్ని అభ్యర్థనలు పంపినా... స్పందన లేదని పేర్కొంది.

నీతి ఆయోగ్ సమావేశాల ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరమయ్యాయని పేర్కొంది. ఇవి రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేశాయని పేర్కొంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలు సహా ఆర్థిక విషయాలలో కేంద్రం రాష్ట్రాలకు స్థిరంగా మద్దతు ఇస్తోందని తెలిపింది. రేపటి నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనకూడదన్న కేసీఆర్‌ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొంది.

`నీతి` చెప్పిన లెక్క‌లు ఇవే..

+ గత నాలుగేళ్లుగా జలజీవన్ మిషన్‌ కింద భారత ప్రభుత్వం తెలంగాణకు 3,982 కోట్లు కేటాయించినా... రాష్ట్రం కేవలం 200కోట్లు మాత్రమే వినియోగించుకుందని తెలిపింది.

+ ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజన కింద ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి అదనంగా 1,195కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొంది.
+ 2016తో పోలిస్తే 2022 నాటికి కేంద్ర పథకాల నిధులు రెట్టింపు అయ్యాయి. ఆర్థిక సంఘం నిధులు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగాయి.