Begin typing your search above and press return to search.

మోడీ దూత ఏపీ ప‌ర్య‌ట‌న మ‌ర్మ‌మేంటో?

By:  Tupaki Desk   |   17 Jan 2018 7:35 AM GMT
మోడీ దూత ఏపీ ప‌ర్య‌ట‌న మ‌ర్మ‌మేంటో?
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్షుడుగా ఉన్న‌ నీతి ఆయోగ్ బృందం ఏపీ ప‌ర్య‌టన ఆస‌క్తిక‌రంగా మారింది. నీతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం 8 గంటలకు విజయవాడలో అడుగుపెట్టనున్నారు. ఆయన గురువారం అంతా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా పోల‌వ‌రం ప్రాజెక్టును కూడా సంద‌ర్శిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న నిధుల మంజూరు కోసం అని అధికార వ‌ర్గాలు చెప్తుండ‌గా...గ‌తంలో వివిధ రూపాల్లో కేంద్రానికి వెళ్లిన ఫిర్యాదులపై ఆరా తీసేందుకని మ‌రికొంద‌రు పేర్కొన్నారు.

దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. 17 పేజీల వినతిపత్రం సమర్పించిన చంద్రబాబు వాటిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాల‌ని ప్రధాని మోడీని కోరారు. దీంతో ప్ర‌ధాని సారథ్యంలోని నీతి అయోగ్ ఉపాధ్య‌క్షుడు రాజీవ్‌ కుమార్‌ ఏపీ షెడ్యూల్‌ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8.40 గంటల వరకు రాజీవ్‌ కుమార్‌ ఏపీలోనే గడపనున్నారు. ఈ పర్యటనలో ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ క్రమంలోనే ఈ పర్యటన ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కుమార్‌ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ వస్తున్నారని, అందులో భాగంగానే ఏపీకి వ‌స్తున్నారన్న వాదన ఉంది. కాగా, నీతి ఆయోగ్‌ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందున రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. మ‌రోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం ‌కూడా ఆయనకు ఏయే అంశాలు నివేదించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. ఇదిలాఉండ‌గా.... నీతి అయోగ్ ఉపాధ్య‌క్షుడిని క‌లిసేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ శ్రేణులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.