Begin typing your search above and press return to search.
అందరికీ ఇల్లు, వాహనం, ఏసీ, ఇంటర్నెట్!
By: Tupaki Desk | 25 April 2017 9:08 AM GMTకూడు, గుడ్డ, ఇళ్లు...ఇవి ప్రతి మనిషి కనీస అవసరాలు అని కొద్దికాలం క్రితం ప్రభుత్వం సూత్రీకరించింది. అయితే కాలం మారిపోయింది కదా, అందుకే ప్రభుత్వం కూడా కనీస అవసరాల జాబితాను మార్చేసింది. ప్రతి ఒక్కరికీ ఇళ్లు - బైకులు/ కార్లు - కరెంటు - ఏసీ - ఇంటర్నెట్....ఇవి కొత్త కనీస అవసరాలు. ఇంతకీ ఇది ఎవరి ప్రతిపాదన అంటే... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రభుత్వ మేధోమథన సంస్థ నీతి ఆయోగ్ ఆవిష్కరించిన స్వప్నం. ఎప్పటివరకు ఇవన్నీ నెరవేర్చుతారు అంటే...మరో 15 ఏళ్లలో దేశంలోని ప్రజలందరికీ ఈ సౌకర్యాలు కల్పిస్తారట!
ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి మూడో సమావేశంలో ఆ సంస్థ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా.. ``2031-32 దార్శనికత-వ్యూహం-కార్యాచరణ ప్రణాళిక`` పేరుతో ఒక పత్రాన్ని ప్రవేశపెట్టారు. మరో 15 ఏళ్ల వ్యవధిలో దేశంలో తీసుకురావాల్సిన మార్పులను, సాధించాల్సిన సమున్నత లక్ష్యాలను దీంట్లో ప్రస్తావించారు. పూర్తిస్థాయిలో అక్షరాస్యత సాధించిన భారతదేశాన్ని, పౌరులందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్న భారతదేశాన్ని పనగరియా ఈ విజన్ డాక్యుమెంట్ లో ఆవిష్కరించారు. విస్తారమైన-అత్యాధునికమైన రోడ్లు, రైళ్లు-జలమార్గాలు-గగనతల రవాణా సేవలను దీంట్లో పనగరియా ప్రస్తావించారు. ప్రజలకు కాలుష్యంలేని గాలి, నీరు లభించేలా స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మించుకోవాలని పేర్కొన్నారు.
2015-16లో రూ.1.06 లక్షలు ఉన్న తలసరి ఆదాయాన్ని 2032 నాటికి మూడింతలు పెంచి రూ.3.14 లక్షలకు చేర్చాలని ఈ దార్శనికపత్రం ప్రతిపాదించింది. 2015-16లో రూ.137 లక్షల కోట్లున్న జీడీపీని (స్థూల దేశీయోత్పత్తిని) 2031-32 నాటికి రూ.469 లక్షల కోట్లకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2015-16లో రూ.38 లక్షల కోట్లున్న కేంద్ర, రాష్ర్టాల వ్యయాలను 2031-32 నాటికి రూ.130 లక్షల కోట్లకు పెంచాలని పేర్కొంది. నీతి ఆయోగ్ నిర్దేశించుకున్న 15 ఏళ్ల దార్శనిక పత్రంపై, ఏడేండ్ల వ్యూహాత్మక పత్రంపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. 2017-20 వ్యవధికి సంబంధించిన మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాలక మండలి సభ్యులకు నీతి ఆయోగ్ అందించింది. దీనిని త్వరలోనే ఖరారు చేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/