Begin typing your search above and press return to search.
బీజేపీ - టీడీపీ పోలవరం గొడవ...క్లారిటీ మిస్
By: Tupaki Desk | 13 July 2018 10:12 AM GMTప్రత్యేక హోదా అంశంలో జట్టు జుట్టు పట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పోలవరం పాజెక్టు విషయంలో మరింత పొగలు సెగలు కక్కుతున్నాయి. ఇరు పార్టీలు ఎంతో ప్రతిస్టాత్మకంగా భావించిన పోలవరం ప్రాజెక్టు ఆ రెండు పార్టీల మధ్య తెగని వివాదంగా మారింది. ప్రపంచంలోనే ఎవరూ ఊహించనంత వేగంగా పనులు జరుపుతున్నామంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు అడ్డంకిగా
మారాయని కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది. ప్రాజెక్టు పనులకు ఇవాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందుల పాలు చేస్తోందని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము అంతకు ముందిచ్చిన నిధులను ఎలా ఖర్చుపెట్టారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది. ఆ పత్రాలు సమర్పిస్తేనే తదుపరి నిధులు ఇస్తామని భీష్మించుకుంది. రెండురోజుల క్రితం పోలవరం పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
పోలవరం పర్యటన ముగిసి విశాఖపట్నం వెళ్లిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టు పనులపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో బీజేపీ సీనియర్ నాయకులతో విశాఖ లో సమావేశమైన కేంద్ర మంత్రి గడ్కరి పోలవరం పనులపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులకు సంబంధించిన నిధుల వ్యయంపై స్పష్టత ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై పోరాడలంటూ బీజేపీ రాష్ట్ర నాయకులకు లోపాయికారిగా ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వ్యవహార శైలిపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిర్రుబుర్రులాడుతున్నారు. పోలవరంలో ఒకలాగ - విశాఖలో మరొకలాగ మాట్టాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తమను ఇబ్బందుల పాలు చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. పోలవరంపై అవసరమైతే కోర్టుకు కూడా వెడతామని - కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరూ లెక్కలు బయటకు చెప్పడం లేదని దీంతో లోపాయికారిగా ఒక్కటై బయటకు కొట్టుకుంటూ ప్రజలను మళ్లీ మభ్యపెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నిజంగా పనులు చేసిన లెక్కలు సర్కారు ఎందుకు చెప్పడం లేదబ్బా? అని అందరూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.