Begin typing your search above and press return to search.
చిక్కకుండా.. దొరక్కుండా మళ్లీ దెబ్బేసిన గడ్కరీ!
By: Tupaki Desk | 11 May 2019 5:04 AM GMTఇప్పటితరానికి పాదరసం అన్న మాట విన్నంతనే అదేంటన్న ప్రశ్న వేయొచ్చు. మెర్య్కురీ అని ఇంగిలిపీసులో చెబితే.. కాస్త అర్థమైనా.. దాన్ని చూసినోళ్లు..దాని స్వభావం గురించి అవగాహన ఉన్నోళ్లు.. దాంతో ఆటలాడుకున్నోళ్లు దాదాపుగా ఉండకపోవచ్చు. పాదరసం నిత్యవసర వస్తువు కాదు. అదే సమయంలో దాని అవసరం ఈ తరం వారికి ఉండకపోవచ్చు.
పాత రోజుల్లో అయితే.. సంప్రదాయ థర్మామీటర్ ను వాడే వేళలో.. జ్వరం వచ్చినప్పుడు నాలుక కిందకానీ.. భుజం రెక్క కింద కానీ పెట్టే వేళలో.. థర్మామీటర్ ముందుండే ముదురుబూడిద రంగు పదార్థం ఏమిటన్న ప్రశ్న వేయటం.. దానికి పాదరసం అని సమాధానం ఇవ్వటం ఉండేది. ఇప్పుడా పరిస్థితే లేదు. చాలా బరువుగా ఉండే పాదరసానికి ఉండే ప్రాథమిక లక్షణం.. అది ఇట్టే జారిపోతూ ఉంటుంది. అది కానీ కిందపడితే.. దాన్ని పట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు.
చూసేందుకు లిక్వెడ్ లా ఉన్నా.. చేతికే కాదు.. దేని మీద వేసినా.. అంటుకోని లక్షణం దాని ప్రత్యేకతగా చెప్పాలి. ఇక.. కింద ఒలికిన పాదరసాన్ని ఒడుపుగా పట్టుకోవటం ఒక కళే. అదిప్పటి వారికి పరిచయం లేని విషయం. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన వస్తుందంటే.. బీజేపీ పెద్ద మనిషి గడ్కరీ ఉన్నారు చూడండి. ఆయన తీరు దాదాపుగా పాదరసం లాంటిదే. మనసులోని మాటను చెప్పకుండా ఉండలేరు. చెబితే.. మోడీషాలు ఏమంటారో బెరుకు లోపల ఉన్నా.. చెప్పకుండా ఉండలేని చిత్రమైన తత్త్వం ఆయన సొంతం.
అందుకే.. ఆయన చిక్కకుండా.. దొరక్కుండా ఉండేలా ఆయన మాట్లాడుతుంటారు. సార్వత్రిక ఎన్నికల ముందు రెండు.. మూడు సార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం.. ఆ వ్యాఖ్యలు మోడీషాలకు పంచ్ లు వేసేలా ఉండటంతో గడ్కరీ ఆసక్తికర అంశంగా మారారు. తనకు ప్రధాని కావాలన్న ఆశ లేదని అడక్కుండా చెప్పే ఆయన మాటలు విన్నోళ్లు ఆశ్చర్యపోతుంటారు. మోడీ ఉన్నంత కాలం బీజేపీ ప్రధానిగా మరెవరినైనా ఊహించగలరా? అయినా కూడా.. తనకు ఎలాంటి ఆశలు లేవని చెప్పే ఆయన.. తాజాగా తనకు తీరుకు తగ్గట్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ వ్యక్తి ఆధారిత పార్టీ ఎప్పటికి కీదని.. సిద్ధాంతాల ప్రాతిపదికగానే పార్టీ పని చేస్తుందని చెబుతుంటారు. తాజాగా అలాంటి మాటల్నే మళ్లీ చెప్పిన ఆయన.. ప్రధాని మోడీ చుట్టూనే బీజేపీ రాజకీయాలు తిరుగుతున్నాయని.. ఆయనపైనే పార్టీ పూర్తిగా ఆధారపడిందన్న మాటల్ని కొట్టి పారేశారు. గతంలో వాజ్ పేయి.. అద్వానీలది కాలేదని.. ఇప్పుడు మోడీషాలది కూడా బీజేపీ కాదని చెప్పారు.
పార్టీ.. ప్రధాని పరస్పరం సహకరించుకుంటారని చెప్పిన ఆయన.. మరో ఆసక్తికర మాటను చెప్పారు. పార్టీ బలంగా ఉండి నాయకుడు బలహీనంగా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించలేం కానీ.. నాయకుడు బలంగా ఉండి.. పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ.. గెలిచే అవకాశాలు ఉంటాయన్నారు. బలమైన నాయకుడికి సహజంగానే అగ్రస్థానం లభిస్తుందని చెప్పారు. మోడీ బలమైన నాయకుడే డౌట్ లేదు.. మరి.. బీజేపీ బలహీనమైన పార్టీ అన్న విషయాన్ని గడ్కరీ చెప్పేశారా? మోడీ షాల లాంటి బలమైన నేతల నేతృత్వంలో బీజేపీ చిక్కబడిపోయిందన్న మాటకు పరమార్థం ఏమిటంటారు? ఎప్పటిలానే.. తనకు ప్రధాని పదవి మీద ఆశ లేదని చెప్పిన గడ్కరీ.. తాజా వ్యాఖ్యలతో మీడియా కన్ను తన మీద పడేలా చేసుకున్నారని చెప్పక తప్పదు.