Begin typing your search above and press return to search.
పచ్చజెండా ఎత్తలేదు..అయినా ముందుకెళ్తున్నారు!
By: Tupaki Desk | 20 Dec 2017 6:22 AM GMTపోలవరం ప్రాజెక్టు విషయంలో.. అది జాతీయ ప్రాజెక్టు గనుక.. దానికి కాగల ప్రతిరూపాయి ఖర్చు కేంద్రప్రభుత్వానిది గనుక.. దాని మీద యాజమాన్యం కూడా కేంద్రప్రభుత్వానిదే గనుక.. పనుల్లో ఏం జరిగినా సరే.. వారి నిర్ణయానుసారమే.. వారి అనుమతుల తర్వాతనే జరగాలి. కానీ.. కొత్త టెండర్లు అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న చంద్రబాబునాయుడు సర్కారు మాత్రం ఆ విషయంలో కేంద్రంనుంచి ఇప్పటిదాకా గ్రీన్ సిగ్నల్ రాకపోయినప్పటికీ.. యథేచ్ఛగా ముందుకెళ్లిపోతున్నారు. కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాన్వేషణలో ఉన్న నేపథ్యంతో ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా కాస్త గడువు పొడిగించి.. తిరిగి కొత్త టెండర్లను తేల్చే దిశగానే వారి అడుగులు పడుతున్నాయి.
పోలవరం విషయంలో కేంద్రం ఇప్పుడు ప్రత్యక్ష పూనిక వహిస్తోంది. ఇదివరకు చంద్రబాబునాయుడు ఎంత ముమ్మరంగా ఈ విషయంలో సమీక్షలు మీటింగులు పెట్టేవాళ్లో.. అంతే జోరుగా ఇప్పుడు నేరుగా నితిన్ గడ్కరీ సమావేశాలు పెడుతున్నారు. నిజానికి చంద్రబాబునాయుడు సమావేశాల్లో డ్రోన్ కెమెరాల్లోంచి వీక్షించడమూ, త్వరగా చేసేయాలి అని ఉపదేశించడమూ తప్ప మరో ప్రయోజనం ఉండేది కాదు. అదే గడ్కరీ సమావేశాల్లో.. అంతో ఇంతో ప్రాజెక్టు పనుల పురోగతికి ఉపకరించే అంశాలు కనపడుతున్నాయి. తాజాగా స్టీల్ - సిమెంట్ లను కాంట్రాక్టరుకు 90 రోజుల అప్పు కింద ఇచ్చేలా కంపెనీలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ అప్పులకు కేంద్రప్రభుత్వమే పూచీ కూడా ఉంటుందని గడ్కరీ స్వయంగా హామీ ఇస్తున్నారు గనుక.. ఈ అప్పుల పర్వం కొలిక్కివచ్చినట్టే. అంటే పనులు వేగంగా జరగడానికి ముడిసరుకు కరవుండదు.
కాకపోతే.. ప్రస్తుత కాంట్రాక్టరుకే ఈ అప్పులు గట్రా ఏర్పాటు చేస్తున్నారు గనుక.. వారి ద్వారా పనులు నడిపించడమే కేంద్రం ఆలోచనగా ఉంది. వారికే నెల గడువిచ్చి వేగం పెంచేలా చూడాలని అనుకుంటున్నారు. నిజానికి అప్పటిదాకా చంద్రబాబు ఉత్సాహపడుతున్న కొత్త టెండర్ల వ్యవహారాన్ని నిలుపుదల చేయాల్సి ఉంది. అయితే ఈలోగా.. రాష్ట్రప్రభుత్వం కొత్త టెండర్ల విషయంలో ముందుకెళ్లిపోతూ ఉంది. ఏదో కాస్త దాఖలు చేసుకోవడానికి గడువు పెంచారు గానీ.. అసలు ఈ టెండరు పనులు దక్కుతాయో లేదో, కేంద్రం ఆలోచనలో స్పష్టతలేకుండా సీరియస్ కాంట్రాక్టర్లు ఎవరు మాత్రం దరఖాస్తు చేస్తారు అనేది మీమాంస. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం అనుమతితో నిమిత్తం లేకుండా.. పాత కాంట్రాక్టరు తొలగింపు అనే సంగతి ఇదమిత్థంగా తేలకుండానే కొత్త టెండర్ల విషయంలో రాష్ట్రం ముందుకెళ్లిపోతుండడం సహజంగానే కొత్త అనుమానాలకు అవినీతి పుకార్లకు ఆస్కారం కల్పిస్తోంది.