Begin typing your search above and press return to search.
అనంత ఊసెత్తకుండానే.. మేనేజ్ చేశారు!
By: Tupaki Desk | 4 Oct 2017 4:20 AM GMTకేంద్రంనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆశిస్తున్న రోడ్డు మార్గాల విషయానికి వస్తే.. అనంతపురం నుంచి అమరావతి దాకా మలుపుల్లేని జాతీయ రహదారి నిర్మిస్తానంటూ చంద్రబాబునాయుడు చేసిన ప్రధాన హామీనే గుర్తుకు వస్తుంది. అభివృద్ధికి పరోక్షంగా కారణమయ్యే రహదార్లను అభివృద్ధి చేయడంలో చంద్రబాబునాయుడుకు బాగానే అనుభవం ఉంది. అదే అనుభవంతోనే ఆయన అమరావతి సరికొత్త రాజధాని నగరాన్ని రాయలసీమతో అనుసంధానం చేసేస్తూ.. కొత్త రోడ్డు వేయబోతున్నట్లు ఘనంగా ప్రకటించారు. అనంతపురం నుంచి నేరుగా రాజధానికి మలుపుల్లేని రోడ్డు రావడం వల్ల.. యావత్ రాయలసీమ ప్రజలకు ఎన్నెన్ని ఎడ్వాంటేజెస్ ఉంటాయో కూడా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ఇదంతా బాగానే ఉంది. అయితే పూర్తిస్థాయిలో కేంద్రప్రభుత్వ నిధులతో చేపట్టవలసిన ఆ జాతీయ రహదారి ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. రోడ్డు నిర్మించడానికి తాము సిద్ధంగానే ఉన్నాం గానీ.. దానికి అవసరమైన భూసేకరణ ఖర్చులు భరించి రాష్ట్రప్రభుత్వమే ఇస్తే గనుక.. తాము రోడ్డు వేస్తాం అంటూ కేంద్రం చెబుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ రహదారికి భూసేకరణ అంటే.. వందల కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్న వ్యవహారం. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం అనుకోకుండా వచ్చి పడిన ఆ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉందా అన్నది ప్రశ్న. దానికి సంబంధించి.. ఆ భారం కూడా కేంద్రం భరించేలా ఒప్పించడానికి చంద్రబాబు సర్కారు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది.
వాస్తవానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డుకు సంబంధించిన స్పష్టమైన హామీ రావాల్సి ఉంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ కి వెళ్లినప్పుడు కూడా ఈ రోడ్డు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వచ్చినట్టు సమాచారం. అయితే గడ్కరీ ఆ రోడ్డు గురించి పల్లెత్తు మాట కూడా పలకనే లేదు. ఆ రోడ్డ గురించి నితిన్ గడ్కరీ ఏదో ఒక స్పష్టత ఇస్తారని నిజానికి వేదిక మీద ఉన్న పెద్దలు కూడా చాలా మంది ఎదురుచూశారు. ఆయన పోలవరం గురించి మాట్లాడి.. ఏపీ సంగతి మేం చూసుకుంటాం అంటూ పడికట్టు మాటలు చెప్పి వెళ్లిపోవడం అందరినీ నొప్పించింది.
నిజానికి ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. అనంత నుంచి అమరావతికి రోడ్డు వస్తుందనగానే.. చాలామంది ఆ మార్గం వెంబడి భారీ పెట్టుబడులు స్థలాలు - పొలాలు కొన్నారు. ఇప్పుడు వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. మరి అనంత ప్రజలు రాయలసీమ వాసులకు ఇచ్చిన మాట గురించి చంద్రబాబునాయుడు కొత్తగా వారికి ఎలాంటి కబురు చెప్తారో చూడాలి.