Begin typing your search above and press return to search.
పెద్ద వల వేసుకొని కమలనాథులు తిరుగుతున్నారా?
By: Tupaki Desk | 17 Nov 2019 9:09 AM GMTఅధికారాన్ని పంచుకోవటంలో తేలని లెక్కలే మహారాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితి కారణంగా చెప్పక తప్పదు. ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ.. సేన పక్షాలు.. ఫలితాలు వెల్లడయ్యాక మాత్రం సీఎం పదవి మీద వచ్చిన పేచీ రెండు మిత్రపక్షాల మధ్యనున్న సుదీర్ఘమైన బంధానికి బీటలు వారేలా చేసింది.
బీజేపీతో తెగతెంపులు చేసుకోవటమే కాదు.. రాజకీయంగా ఏ మాత్రం భావసారూప్యత లేని ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలతో జత కట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటివేళ.. గవర్నర్ వారి జోక్యంతో ఆ రాష్ట్రంలో వేగంగా పరిణామాలు చోటు చేసుకోవటం రాష్ట్రపతి పాలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.
రాష్ట్రపతి పాలన పేరుతో తమ పార్టీకి చెందిన వారిని అభద్రతా భావంలోకి పడేసి.. తమవైపునకు తిప్పుకునే దుర్మార్గమైన ప్లాన్లు వేస్తున్నట్లుగా శివసేన.. ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ పిలిచిన వేళ.. తమకు బలం లేదని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పిన బీజేపీ నేతలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా తమ పార్టీకి 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటనలు చేయటం వెనుక ప్లాన్ వేరే ఉందంటున్నారు.
ఈ విషయమేదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరినప్పుడే చెబితే సరిపోయేది సరికదా? అన్నది సేన.. ఎన్సీపీ నేతల వాదన. అప్పుడు చేతులు ఎత్తేసి.. రాష్ట్రపతి పాలన వేళ మాత్రం తమకు 119 మంది సభ్యుల బలముందన్న మాటకు అర్థమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో గెలుపొందించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే..145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. స్వతంత్ర అభ్యర్థులు 14 మంది మద్దతు తమకు ఉందని చెబుతున్న కమలనాథులు.. మరో 26 మంది కోసం వలలు పట్టుకొని తిరుగుతున్నట్లుగా శివసేన.. ఎన్సీపీలు అభివర్ణిస్తున్నాయి.
పెద్ద ఎత్తున పార్టీల్ని చీల్చి.. బీజేపీలో విలీనం చేయించటం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఇటీవల రాజకీయాల్ని క్రికెట్ తో పోల్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాటలపైనా శివసేన పార్టీ నేతలు మండిపడుతున్నారు.
రాజకీయాల్ని క్రికెట్ ఆట కంటే తక్కువగా.. వ్యాపారం కంటే ఎక్కువగా మార్చేస్తుందంటూ ఫైర్ అవుతున్నారు. శివసేన.. ఎన్సీపీలు అనుమానిస్తున్నట్లు బీజేపీ నేతలు వలలు పట్టుకొని తిరుగుతున్నారా? అన్న విషయం మీద మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుందన్న మాట వినిపిస్తోంది.