Begin typing your search above and press return to search.
వామ్మో!... ప్రధాని పదవినే వద్దనేశారే!
By: Tupaki Desk | 10 May 2019 4:37 PM GMTప్రధాని పదవి వద్దంటున్న వారి జాబితా ఇటీవలి కాలంలో బాగానే పెరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని పదవి తనకు వద్దంటూ టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఒక్కసారి కాదు... ఈ మాటను చంద్రబాబు చాలా సార్లే చెప్పారు. ప్రధాని పదవి వద్దనడానికి చంద్రబాబు పెద్దగా కారణాలు చెప్పలేదు గానీ... ఎప్పుడు జాతీయ రాజకీయాల ప్రస్తావన వచ్చినా... తనకు ప్రధాని పదవి వద్దనే ఆయన అంటున్న వైనం మనకు కొత్తేమీ కాదు. ఇప్పుడు చంద్రబాబు మాదిరే ప్రధానమంత్రి పదవి తనను ఏరికోరి వచ్చినా... తాను స్వీకరించబోనని మరో నేత చెప్పేశారు. జాబితాలో కొత్తగా చేరిన ఈ నేత మరెవరో కాదు... బీజేపీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని మోదీ కేబినెట్ కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నితిన్ గడ్కరీ.
వ్యవహారాలను చక్కబెట్టడంలో మంచి నేర్పరిగా పేరున్న గడ్కరీ... ఓ దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగారు. అయినా ఇప్పుడు ఈయన నోట నుంచి ఈ మాట ఎందుకు వచ్చిందన్న విషయానికి వస్తే... మోదీ మేనియా ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపేలా లేదు. గడచిన ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ ఈ సారి బీజేపీకి గానీ, ఎన్డీఏకు గానీ వచ్చే అవకాశాలే లేవు. అయితే అవతల ప్రత్యర్థి బలంగా లేని నేపథ్యంలో సీట్టు తగ్గినా.. మరోమారు ఎన్డీఏనే అధికారం చేపట్టవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... ఎన్డీఏ కూటమి ప్రధాని పదవికి మోదీని కాకుండా వేరే నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయన్న వార్తలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మోదీని వద్దంటే... ప్రధాని పదవికి నితిన్ గడ్కరీ ఒక్కరే సరైన నేతగా కనిపిస్తున్నారన్న విశ్లేషణలు సాగాయి.
ఈ నేపథ్యంలో ఈ వార్తలు గడ్కరీ చెవిన కూడా పడ్డాయి. దీంతో ఇప్పటికే చాలా సార్లే తనకు ప్రధాని పదవి వద్దంటూ చాలా క్లారిటీగానే చెప్పేసిన గడ్కరీ... ఇప్పుడు మరింత క్లారిటీగా ప్రధాని పదవిని తాను చేపట్టేది లేదని తేల్చేశారు. తనకు ప్రధాని కావాలన్న కోరిక గానీ, కల గానీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మాటలన్నీ కేవలం ఊహాగానాలేనని, వాటిని తాను పెద్దగా పట్టించుకోనని కూడా గడ్కరీ పేర్కొన్నారు. ప్రధాని పదవికి తాను రేసులో లేనని, అసలు ప్రధాని కావాలన్న ఆశ - కల తనకు లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రధాని మోదీయే తమ లీడర్ అన్న ఆయన.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక మోదీనే పీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.మొత్తంగా ప్రధాని పదవి తనకు వద్దంటూ గడ్కరీ చాలా క్లారిటీగానే చెప్పేశారన్న మాట.