Begin typing your search above and press return to search.
నితీశ్ నోట పెద్ద హామీ.. ప్రధాని అయితే.. ఏపీకి శుభవార్తే
By: Tupaki Desk | 15 Sep 2022 12:01 PM GMTబిహార్ సీఎం నితీశ్ కుమార్.. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమైంది. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అనేలా కనిపించిన ఆయన ఇక కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టడం
పక్కా అని తెలిసిపోతోంది. ఇటీవలే బిహార్ లో బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీ-కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలపై చూపు నిలిపారు.
దీనికితగ్గట్లే ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలందరినీ కలిశారు.
వీరిలో అర్వింద్ కేజ్రీవాల్ వంటి వారున్నారు. అంటే.. అన్ని పక్షాలను కలుపుకొని పోయే ఆలోచనలో ఆయన ఉన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. నితీశ్ ప్రయత్నాలను చూశాక ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధానమంత్రి రేసులో ఉండొచ్చని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా వ్యాఖ్యలు మరింత చర్చ రేపుతున్నాయి.
వెనుకబడిన రాష్ట్రాలకు హోదా అంటూ కేంద్రంలో అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామంటూ నితీశ్ ప్రకటించారు. అంటే దీన్నిబట్టి ఆయన కేంద్ర రాజకీయాలపై చూపు నిలిపారని తెలుస్తోంది.
ఈ సంగతిని బిహార్ రాజధాని పట్నాలో ప్రకటించారు. బీజేపీ లేకుండా 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని.. ిలా చేయకుండా ఉండబోమని స్పష్టం చేశారు.
ఉమ్మడి అభ్యర్థి ఆయనేనా..? కేంద్రంలో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలకు దీటైన అభ్యర్థి నితీశేనని ప్రచారం జరుగుతోంది. అనుభవం, నిజాయతీ రీత్యా చూసినా మోదీకి సరితూగగల వ్యక్తి నితీశే. దీంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలిపే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు మాత్రం తనకు ఆ యోచన లేదని నితీశ్ చెబుతున్నారు. బీజేపీకి ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని మాత్రం అంటున్నారు. మరోవైపు తన సొంత రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2007 నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బీజేపీతో కొనసాగినా ఈ
డిమాండ్ ను వదల్లేదు.
ఆయన మాట ఏపీకి వరాల మూట ఉమ్మడి ఏపీ పునర్విభజన హామీల్లో ప్రధానమైనది ఏపీకి ప్రత్యేక హోదా. కానీ, మన్మోహన్ ప్రభుత్వం, ప్రస్తుత మోదీ ప్రభుత్వం దానిని ఇవ్వలేదు. నితీశ్ మాత్రం వెనుకబడిన రాష్ట్రాలకు ఇస్తాం అని అంటున్నారు. అంటే ఏపీకి వరాల మూటే. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుంది. కేంద్రం 90 శాతం నిధులిస్తుంది. ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, మరికొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.