Begin typing your search above and press return to search.
జగన్ బాటలో నితీశ్.. తాజా ఫలితాలతో రూటు మార్చేశారుగా?
By: Tupaki Desk | 15 Nov 2020 10:30 AM GMTబిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఇంకా అధికార బాధ్యతల్ని చేపట్టని విషయం తెలిసిందే. దీపావళి తర్వాత.. కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయాలని భావిస్తున్నారు. దీనికి తోడు.. గతానికి భిన్నంగా ఎన్డీయే కూటమిలో బీజేపీ అధిక స్థానాల్ని సొంతం చేసుకోవటం.. నితీశ్ సారధ్యంలోని జేడీయూ పరిమితంగానే స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ కూర్పు ఎక్కువగా బీజేపీ అధినాయకత్వ ఆలోచనలకు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు.. పదవుల కేటాయింపు తదితర అంశాలపై చర్చలు జరిపేందుకు పాట్నాలోని నితీశ్ నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలోనే ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న విషయంతో పాటు.. మంత్రి పదవుల మీద కూడా క్లారిటీ రానుంది. తాజా ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ఆశించినంతగా రాలేదు. ఆ మాటకు వస్తే.. ఎగ్జిట్ పోల్స్ అని మహా కూటమికి అనుకూలంగా పేర్కొన్నాయి. స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీయే.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉండాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్డీయే కూటమిలో జేడీయూతో పాటు.. వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ.. హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు ఏ పదవులు ఇవ్వాలన్న అంశంపై చర్చ జరగనున్నట్లు చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవుల్ని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లుచెబుతున్నారు. ఏపీలో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్.. కీలక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారో.. అదే రీతిలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఎన్డీయేలోని బీజేపీతో పాటు కీలకపక్షాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. అన్ని వర్గాలకు సమానంగా అవకాశాల్ని కల్పించినట్లు అవుతుంది. ఇక.. ముఖ్యమంత్రిగా నితీశ్ కొనసాగుతారని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీని ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఒకసారి అవకాశం ఇచ్చినందున.. ఈసారి మరొకరి ఈ అవకాశాన్ని ఇచ్చి.. ఆయనకు మరో కీలక పదవిని అప్పజెప్పి బుజ్జగిస్తారని చెబుతున్నారు. మొత్తంగా ఎన్డీయేలోని అన్ని వర్గాల వారు సంతోష పడేలా పదవుల కేటాయింపు ఉంటుందంటున్నారు.