Begin typing your search above and press return to search.
నితీశ్ కీలక నిర్ణయం పార్టీ పదవికి రాజీనామా.. వెనుక ఏం జరిగింది?
By: Tupaki Desk | 27 Dec 2020 4:08 PM GMTబిహార్‌లో బీజేపీ-జేడీయూ(జనతా దళ్ యునైటెడ్) కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షు డు నితీశ్ కుమార్ .. తన పార్టీ పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. పార్టీ అధ్యక్షుడిగా జేడీయూ రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్ ఎంపికయ్యారు. తాజాగా జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం అధ్యక్ష పదవికి బ్యూరోక్రాట్ అయిన ఆర్సీపీ సింగ్‌ను ప్రతిపాదించారు. పార్టీ సభ్యులందరూ ఆమోదం తెలపడంతో ఆయన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్సీపీ సింగ్ ఇప్పటి వరకు జేడీయూ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన జేడీయూకు అధ్యక్షుడు అయ్యారు. నితీశ్ పార్టీ పదవిని వదిలి.. ఇక సీఎంగా పూర్తి సమయం పనిచేయనున్నారు.
తెరవెనుక అనేక కారణాలు..
సౌమ్యుడు, మితభాషిగా పేరున్న నితీశ్ కుమార్.. జేడీయూ అధ్యక్ష పగ్గాలను వదులు కోవడం వెనుక ఏమీ సైలెంట్‌గా జరిగిపోలేదు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. పార్టీలో తీవ్రమైన వ్యతిరేకతను నితీశ్ కూడగట్టుకున్నారు. ముఖ్యంగా 2015లో పార్టీ.. ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత.. హఠాత్తుగా ఆర్జేడీని వదిలించుకుని.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఈ క్రమంలోనే ఆయన నాటకీయ పరిణామాలకు తెరదీశారు. దీంతో సీనియర్లు పార్టీకి దరమయ్యారు. ఇక, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేయగల.. లోక్ జనశక్తి పార్టీతోనూ నితీశ్ కయ్యానికి దిగారు. ఎన్నికలకు ముందు ఎల్‌జేపీ చీఫ్‌గా ఉన్న చిరాగ్.. నితీశ్ అనుభవం అంత వయసు కూడా లేని యువ నేత రెచ్చిపోయారు.
ఫలితంగా జేడీయూ.. గెలుస్తుందని ఆశ పెట్టుకున్న స్థానాలు కొలాప్స్ అయ్యాయి. వాస్తవానికి నెల రోజుల కిందట జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు నితీశ్ ఎంతో కృషి చేశారు. అయితే.. ఆశించిన సీట్లను మాత్రం సాధించలేక పోయారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో అప్పట్లోనే నితీశ్ సారథ్యంపై పార్టీలో లుకలుకలు వినిపించాయి. ఆయన ఆర్జేడీని, ఎల్జేపీని దూరం చేసుకోవడంతోనే.. పార్టీ పుట్టిమునిగిందని సీనియర్లు భావిస్తున్నారు. కానీ, అప్పట్లో మౌనంగా ఉన్న నితీశ్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్నయితే.. ఏర్పాటు చేశారు. కానీ, స్వతంత్రంగా పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. దీంతో జేడీయూలో నాయకులు ఒక్కరొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు.
ఇటీవల జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరిపోయారు. ఈ పరిణామాతో నితీశ్‌పై తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పార్టీ పదవికి రాజీనామా చేశారనేది వాస్తవం. నిజానికి చెప్పాలంటే.. ఆయన జేడీయూ మాజీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ గత ఏడాది 2019లో తిరిగి ఎంపికయ్యారు. దీంతో ఆయన పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉంది. కానీ, ఇప్పుడు పెల్లుబికిన వ్యతిరేకత, పొంచిఉన్న బీజేపీ వ్యూహాలతో సతమతం కాలేక.. పదవికి రాజీనామా చేశారని అంటున్నారు పరిశీలకులు.