Begin typing your search above and press return to search.
లాలూ ఇంటికి నితీశ్ వెళ్లి వచ్చిన తర్వాత..
By: Tupaki Desk | 30 Nov 2016 10:23 AM GMTనోట్ల రద్దు నిర్ణయంపై నిన్నటి వరకూ అగ్గి మీద గుగ్గిలం అయిన ఆర్జేడీ అధినేత లలూప్రసాద్ యాదవ్ లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. విపక్షాలకు తగ్గట్లే ఆయన మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. రద్దు నిర్ణయంపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలతో కలిపిన ఆయన అనూహ్యంగా తన తీరును మార్చేసుకున్నారు. దీనికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ప్రభుత్వ భాగస్వామి పక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లారు.ఆయనతో మాట్లాడారు.
అనంతరం బయటకు వచ్చిన ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ తాను నోట్ల రద్దుకు వ్యతిరేకం ఎంతమాత్రం కాదని.. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకుంటున్న పరిస్థితుల విషయంలోనే తాను ఆందోళన చెందుతున్నట్లుగా వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
నిన్నమొన్నటి వరకూ మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి బహాటంగానే మద్దతు ఇచ్చిన విపక్ష ముఖ్యమంత్రిగా నిలిచిన నితీశ్ చర్య.. బీహార్ రాజకీయాల్లో మార్పులకు కారణంగా మారుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. నితీశ్ నోట్ల రద్దుకు అనుకూలంగా మాట వచ్చిన క్రమంలో రానున్న రోజుల్లో జేడీయూ.. బీజేపీకి దగ్గర అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.ఇదిలా ఉండగా.. లాలూ ఇంటికి వెళ్లి నితీశ్ మాట్లాడిన తర్వాత.. ఆర్జేడీ చీఫ్ నోటి మాట మారిపోవటమే కాదు.. రద్దుకు అనుకూలంగా మాట్లాడటం మిగిలిన విపక్షాలకు షాకింగ్ గా మారింది. ఇంతకీ.. లాలూతో నితీశ్ ఏం చెప్పారంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/