Begin typing your search above and press return to search.

30మందిపై లైంగిక దాడి కేసు ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్

By:  Tupaki Desk   |   8 Oct 2020 3:51 PM
30మందిపై లైంగిక దాడి కేసు ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్
X
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. ధనవంతులు, పరపతి గల వారు.. మంచి నేతలవైపు అందరూ మొగ్గుచూపుతున్నారు.

అధికార జేడీయూ ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది. 90మందితో కూడిన జాబితాను పార్టీ చీఫ్.. సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. వీరిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు పలువురికి కొత్త వారికి కూడా చోటు దక్కింది.

ఇక జేడీయూ విడుదల చేసిన తాజా జాబితాలో అనూహ్యంగా ఓ ఇద్దరు వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మంజూవర్మకు నితీష్ మరోసారి టికెట్ ఇవ్వడం గమనార్హం. బాలికలపై లైంగిక దాడి కేసులో మంజూవర్మ కేసు నమోదైంది. ఆమె బెయిల్ పై విడుదలై బయట ఉన్నారు. సీబీఐ విచారణ సైతం జరుగుతోంది.

2018లో షెల్టర్ హోం కేసు బయటపడింది. 30మంది బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి మంజూవర్మను నితీష్ తప్పించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంజూకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.