Begin typing your search above and press return to search.

ఆ సీఎం ఇంటికి ఇప్ప‌టికీ క‌రెంట్ లేదు

By:  Tupaki Desk   |   25 Oct 2015 11:50 AM GMT
ఆ సీఎం ఇంటికి ఇప్ప‌టికీ క‌రెంట్ లేదు
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ కుమార్ ఇంటికి క‌రెంటు సౌక‌ర్యం లేదు. అలాగ‌ని నితీశ్ అధికారిక నివాసానికి కాదు.. ఆయ‌న స్వ‌గ్రామంలో ఉన్న ఇంటికి క‌రెంటు క‌నెక్ష‌న్ లేని ప‌రిస్థితి. బీహార్ లోని న‌లంద జిల్లాలోని క‌ళ్యాణ్ బిగా అనే గ్రామంలో నితీశ్ కు ఇల్లుంది.

అయితే.. ఆ గ్రామంలో 24 గంట‌ల విద్యుత్తు సౌక‌ర్యం ఉన్నా.. నితీశ్ ఇంటికి మాత్ర‌మే విద్యుత్తు సౌక‌ర్యం లేదు. ఎందుకిలా అంటే.. బీహార్‌లోని ప్ర‌తి ఇంటికి విద్యుత్తు క‌నెక్ష‌న్ ఇచ్చే వ‌ర‌కూ త‌న ఇంటికి క‌రెంటు క‌నెక్ష‌న్ పెట్టించుకోన‌ని శ‌ప‌ధం చేశార‌ట‌. ఇందులో భాగంగానే త‌న ఇంటికి విద్యుత్తు సౌక‌ర్యాన్ని ముఖ్య‌మంత్రి ఏర్పాటు చేసుకోలేద‌ని చెబుతున్నారు.

సాధార‌ణంగా సీఎం స్థాయి వ్య‌క్తికి గ్రామంలో ఇల్లు ఉంటే.. ఆ గ్రామానికి రోడ్లు మొద‌లు మిగిలిన సౌక‌ర్యాలు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాటు చేస్తారు. ఒక‌వేళ గ్రామం మొత్తం చేయ‌కున్నా.. సీఎం ఇంటి వ‌ర‌కూ మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా పూర్తి చేస్తారు. కానీ.. నితీశ్ మాత్రం అందుకు భిన్నం. ఈ కార‌ణంతోనే నితీశ్ ప‌దేళ్లుగా బీహార్ ముఖ్య‌మంత్రిగా రాజ్య‌మేలుతున్నారు.(మ‌ధ్య‌లో కొంత కాలం ముఖ్య‌మంత్రిగా లేరు) ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇంత సుదీర్ఘ‌కాలం పాటు ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలోని ప్ర‌తిఒక్క ఇంటికి విద్యుత్తు ఇవ్వ‌లేక‌పోవ‌టం విజ‌య‌మా? వైఫ‌ల్యంగా భావించాలా..?

త‌న ఇంటికి విద్యుత్తు క‌నెక్ష‌న్ లేద‌న్న మాట వినేందుకు బాగానే ఉన్నా.. ఆ ఇంట్లోకి క‌నుక బ‌స చేయ‌టానికి వ‌స్తే.. సిబ్బంది జ‌న‌రేట‌ర్ ఏర్పాట్లు చేస్తారు క‌దా. అలాంట‌ప్పుడు విద్యుత్తు క‌నెక్ష‌న్ ఉంటే ఏమిటి? లేకుంటే ఏమిటి..?