Begin typing your search above and press return to search.
మోడీకి నితీశ్ మార్క్ ఝలక్
By: Tupaki Desk | 18 Nov 2015 7:01 AM GMTబీహార్ ఎన్నికల ఫలితాల వేడి ఇంకా చల్లారడం లేదు. దుమ్మురేపే మెజార్టీతో విజయం సాధించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మరియు టీంకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో మోడీ-షా జోడిపై విశ్లేషణలు ఇంకా కొనసాగుతుండగా... మరో ఝలక్ ఇచ్చేందుకు నితీశ్ సిద్ధమయినట్లు సమాచారం. అది కూడా తన ప్రమాణస్వీకారం వేదికగా ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 26నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే 20వ తేదీన బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు దేశంలోని కీలక నేతలకు, అన్నిపార్టీల అగ్రనేతలకు నితీశ్ ఆహ్వానం పంపారు. దీంతో వివిధ రాష్ట్రాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ రాకపై ఇంకా అస్పష్టత కొనసాగుతుంది. మోడీ ఈ సభకు హాజరైతే ఆయన పెద్దరికాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది.
అయితే ఈ ప్రమాణస్వీకారం మరో ఆసక్తికర పరిణామానికి శ్రీకారం కానుంది. నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విపక్షాల ఏకీకరణ వేదికగా మారనున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ అంటే ఇంతెత్తున లేచే ప్రతిపక్ష పార్టీలు, నాయకులంతా ఈ సమావేశానికి తప్పకుండా హాజరవుతారని అంచనా. తద్వారా మోడీకి ప్రతిపక్షాల సత్తా చాటి చెప్పనున్నారని తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు జరుగుతున్న ప్రతిపక్షాల ఏకీకరణ....చట్టసభలు జరుగుతున్న సమయంలోనూ తమ ప్రభావాన్ని చూపనుందని భావిస్తున్నారు.