Begin typing your search above and press return to search.

అఖిలేష్ కు పెద్దాయన సక్సెస్ మంత్రం!

By:  Tupaki Desk   |   18 Oct 2016 5:10 PM IST
అఖిలేష్ కు పెద్దాయన సక్సెస్ మంత్రం!
X
సీనియర్ నాయకులు తమ తమ అనుభవాలను రేపటి తరానికి చెప్పడం, ఆ మార్గంలో వెళితే సక్సెస్ వస్తుందని చెప్పడం వింటూనే ఉంటాం. ఇది కేవలం వారసులకే కాదు ఎవరికైనా చెప్పొచ్చు అని నిర్ణయించుకుని చెప్పేశారు జేడీయూ చీఫ్ - బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2017లో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏమి చేయాలనేది అఖిలేష్ కు తన సొంత అనుభవం మేరకు అద్భుతమైన సలహా ఇచ్చారు నితీష్.

"అఖిలేష్ నువ్వు తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటే నేను చెప్పినది పాటించు.." అంటూ మొదలుపెట్టిన నితీష్... "బిహార్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లోనూ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నిన్ను వెతుకుంటూ వస్తుందని, గత సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ లో నా సక్సెస్ మంత్రకూడా అదే"నని నితీష్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లో జరిగిన హోరాహోరీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు ప్రధాన కారణం సంపూర్ణ మద్య నిషేధ హామీనేనని, అదే మంత్రాన్ని ఇప్పుడు యూపీలోనూ అమలుచేయాలని అలా చేస్తే ఇక తిరుగుండదని నితీష్ సూచించారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మహిళా ఓటర్ల మద్దతు పొందవచ్చని, దీంతో తన ఖాతాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకోవచ్చని అఖిలేష్ కు నితీష్ సూచించారు.

వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపై ములాయం సింగ్ క్లారిటీ ఇవ్వని సంగతి తెలిసిందే. అలాగే బాబయ్ శివ్ పాల్ యాదవ్ నుంచి కూడా అఖిలేష్ కు మద్దతు లేకపోవడంతో నితీష్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. ఈ సందర్భంగా... యూపీలో మద్య నిషేధం అమలు చేపడితే, ఎన్నికల్లో గెలవడానికి ఎవరి సపోర్టు అక్కర్లేదని నితీష్ పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/