Begin typing your search above and press return to search.
నితీశ్ మోడీని ఇరికించినట్లా..సపోర్టు చేసినట్లా?
By: Tupaki Desk | 18 Sep 2017 5:02 PM GMTప్రధాని మోడీ అంటే ఇంతెత్తున లేచే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పుడు బీజేపీతో ఫ్రెండ్ షిప్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి మంచి మిత్రుడైపోయినా ఆయన తాజాగా ఓ విషయంలో చేసిన వ్యాఖ్యలు, స్పందించిన తీరు అర్థం కాక రాజకీయ పండితులే అయోమయంలో పడిపోయారు. పరిణతి చెందిన నేతగా పేరున్న నితీశ్ చాలా క్లారిటీతో ఉంటారు. అయితే.... ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు - యాక్టివిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో ఆయన ఏకంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని - ఆ రాష్ర్ట సీఎంను నిలదీస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
నిజానికి గౌరీ హత్య వెనుక హిందూత్వ శక్తులున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మోడీ పాలనలో హిందూత్వ శక్తుల జోరు పెరిగిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ - ఇతర పలు పార్టీలు నిత్యం ఇవే ఆరోపనలు చేస్తున్నాయి. మరోవైపు గౌరీ లంకేశ్ హత్య వెనుక కుటుంబ కారణాలు, ఆస్తి గొడవలు ఉన్నాయన్న వాదనా బలంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన రాష్ర్టంతో సంబంధం లేని విషయంలో తలదూర్చి మరీ కర్ణాటక సీఎంను నిలదీస్తూ ప్రశ్నలు కురిపించడంతో హిందూత్వ వాద పార్టీగా ముద్రపడిన బీజేపీ ఇరుకునపడ్డట్లయిందటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గౌరీ లంకేశ్ హత్యకేసులో ఇంతవరకు ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఈ కేసులో విచారణను మెల్లిగా జరుపుతున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సమర్థవంతంగా విచారణ జరిపించడంలో పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇటువంటి ఘటనే తమ బీహార్ లో జరిగి ఉంటే ఎంతో రచ్చ చేసేవారని వ్యాఖ్యానించారు. నితీశ్ వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర కారణాల వల్లే గౌరీ లంకేశ్ హత్య జరిగిందన్న విషయం తేలితే బీజేపీపై మచ్చ తొలగుతుందన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.