Begin typing your search above and press return to search.
మోడీకి షాక్.. విపక్షాలను ఐక్యం చేస్తానన్న నితీష్.. బిహార్ సర్కారు సేఫ్
By: Tupaki Desk | 24 Aug 2022 5:30 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ భారీ షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని.. దీనికి సంబందించి.. ప్రతిపక్షాలకు ఏకం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీతో ఉన్న బంధానికి స్వస్తి పలికి కొత్త కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీష్ కుమార్ తాజాగా బలనిరూపణలో విజయం సాధించారు. ఈ నెల 10న ఆర్జేడీ, కాంగ్రెస్ సహా పలుపార్టీలతో కలిసి మహాగట్ బంధన్ ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకుంది.
ముఖ్యమంత్రిగా నీతీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. అనంతరం బుధవారం నిర్వహించిన బలపరీక్షలో నెగ్గి నీతీష్ తన పదవిని కాపాడుకున్నారు.
పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి మహేశ్వర్ హజారీ ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహించారు. 243మంది సభ్యులుగల బిహార్ శాసనసభలో 160 ఓట్లతో నీతీష్ సర్కార్ విజయం సాధించారు. బలపరీక్ష అనంతరం సభను వాయిదా వేశారు. అయితే.. దీనికి ముందు సభలో సీఎం నితీష్ ఆవేశంగా ప్రసంగించారు.
ఎల్జేపీ నేత చిరాగ్ పాస్‌వాన్ తిరుగుబాటును పరోక్షంగా ప్రస్తావించారు. బీజేపీ ఆదేశాలతో ఆర్సీపీ సింగ్.. జేడీయూలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని పదవి కోసమే మహాగట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న ఆరోపణలను ఖండించిన నీతీష్.. తనకు వ్యక్తిగత ఆశయాలు లేవని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలకు ఐక్యం కావాలని దేశంలోని అన్నిపార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ముందుకు వచ్చే పార్టీలను తాను క్యంగా ముందుకు తీసుకువెళ్తానన్నారు.
అదే సమయంలో బీజేపీతో తన పాత బంధాన్ని గుర్తుచేసుకున్న నీతీశ్.. వాజ్‌పేయి, అడ్వాణీ, మురళీమనోహర్ జోషికి.. ప్రస్తుత కమలదళం అధినాయకత్వానికి ఉన్న తేడాను నొక్కిచెప్పారు. ప్రస్తుత పాలనలో ప్రచారం తప్ప పాలన చాలా తక్కువ అని ప్రధాని పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక సమరంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. ఆదిశగా ప్రజలు కూడా సిద్ధమయ్యారని.. నితీష్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.