Begin typing your search above and press return to search.
యూటర్న్ తీసుకొని మోడీకి షాకిచ్చిన మిత్రుడు
By: Tupaki Desk | 28 May 2018 3:30 PM GMTప్రధాని నరేంద్ర మోడీకి ఊహించిన షాక్ ఒకటి తగిలింది. అయితే.. ఈ షాక్ ప్రత్యర్థి నుంచి కాక మిత్రుడి నుంచి కావటం విశేషం. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే షాక్ కు గురైనప్పటికీ.. కాస్త నెమ్మదిగా మోడీ నిర్ణయానికి సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ దెబ్బతో అవినీతి దుకాణం బంద్ కాకున్నా.. గతంలో మాదిరి విచ్చలవిడితనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. అదేమీ లేదన్న సంగతి గడిచిన కొంతకాలంగా అందరికి అర్థమయ్యే పరిస్థితి.
పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తొలుత విమర్శ.. తర్వాత ప్రశంస పొందిన మోడీకి.. ఇటీవల కాలంలో ఈ నిర్ణయం తప్పు అన్న మాట పలువురి నోట వస్తూ అంతకంతకూ ఒత్తిడి పెరుగుతోంది. పెద్దనోట్ల రద్దుపై ప్రశంసలు కురిపించిన సీనియర్ నేతలు సైతం.. ఈ నిర్ణయం తప్పని.. తాము తప్పుగా ఆలోచించినట్లుగా వారిప్పుడు చెబుతున్నారు.
ఇప్పుడు అలాంటి జాబితాలో చేరారు బిహార్ ముఖ్యమంత్రి.. మోడీకి జానీ జిగిరి దోస్తుగా మారిన నితీశ్ కుమార్. పెద్దనోట్ల రద్దుపై ఇప్పటివరకూ మోడీకి అండగా నిలిచిన ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
కేవలం ధనవంతులు.. సంపన్నులకు మాత్రమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా లబ్థి చేకూరినట్లుగా చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా నిరుపేదలు.. బలహీన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్న నితీశ్.. ఎలాంటి ప్రయోజనమైనా జరిగిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పు పడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. వారికి విమర్శలకు బలం చేకూరేలా మోడీ మిత్రుడే స్వయంగా తప్పు పట్టటంతో విపక్షాలు చేసే వ్యాఖ్యల్లో నిజం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీకి మిత్రుడిగా ఉంటూ.. ఆయన్ను అంత గొప్ప.. ఇంత గొప్ప అంటూ ప్రశంసించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పుడు తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
బిహార్ లో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. పెద్దనోట్ల రద్దును తప్పు పట్టటం ఆసక్తికరంగా మారింది. పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్యులు నష్టపోతున్నరన్న విమర్శను బీజేపీ సీనియర్ నేత.. బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ సమక్షంలోనే చేయటం గమనార్హం. అదేంది మోడీ.. మిత్రులు కూడా మీ నిర్ణయాన్ని తప్పు పట్టేస్తున్నారు? ఇలా అయితే ఎలా మోడీజీ?