Begin typing your search above and press return to search.
సీఎం పదవికి నితీశ్ నో
By: Tupaki Desk | 14 Nov 2015 7:29 AM GMTబీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామ పత్రాన్ని గవర్నర్ కు సమర్పించినట్లు నితీష్ పేర్కొన్నారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు తెలిపారు.
కంగారు పడకండి. మీరు చదివింది నిజమే. బీహార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం హోదాలో నితీశ్ తిరిగి అలాగే కొనసాగేందుకు రాజ్యాంగం ఒప్పుకోదు. నిబంధనల ప్రకారం ఎన్నికల సమయం వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ అపద్దర్మ సీఎంగా పదవిలో ఉంటూ రాష్ర్ట పాలనా బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత వేరే నాయకుడు సీఎం పగ్గాలు చేపట్టినా లేదా ఒకవేళ అదే నాయకుడు సీఎంగా గెలిచినా...రాజీనామా చేసి తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నితీశ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 20న నితీశ్ తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.