Begin typing your search above and press return to search.

షాకిచ్చిన బీజేపీ: బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా

By:  Tupaki Desk   |   13 Nov 2020 6:29 PM GMT
షాకిచ్చిన బీజేపీ: బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా
X
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఫగూ చౌహాన్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అదే సమయంలో అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా కోరారు.

గవర్నర్ నితీష్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. అసెంబ్లీ రద్దు ప్రక్రియను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సాంకేతిక అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

నితీష్ కుమార్ రాజీనామా లేఖతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. కాగా రాజీనామాకు ముందు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ, జేడీయూ, హెచ్ఎంఏ, వీఐపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా నవంబర్ 15న ఆదివారం నాలుగు పార్టీల ఎమ్మెల్యేల ఉమ్మడి సమావేశం నిర్వహించి అదే రోజు శాసనసభా పక్ష నేతగా నితీష్ కుమార్ ను ఎన్నుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

కాగా బీహార్ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు, జేడీయూకి 43 సీట్లే వచ్చాయి కానీ సీఎం అభ్యర్థిగా జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా సరే నితీష్ నే సీఎంగా కూటమి ఎన్నుకుంది. దీంతో నితీష్ ఏడోసారి ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు.

కాగా ఇన్నాళ్లు జేడీయూ లీడింగ్ పార్టీగా ఉండడంతో నితీష్ ఆడింది ఆటగా ఉండేది. ఇప్పుడు బీజేపీ లీడింగ్ కావడంతో కండీషన్లు అప్లై కానున్నాయి. నితీష్ కలల పథకం మద్యనిషేధానికి ముగింపు పలకాలని బీజేపీ ఒత్తిడి చేస్తోంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనైనా మద్యం నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎంపీ కోరారు.