Begin typing your search above and press return to search.
అద్వానీ మాటలు.. శత్రువులకు అస్త్రాలయ్యాయి!
By: Tupaki Desk | 29 Jun 2015 6:07 AM GMTభారతీయ జనతా పార్టీ కి పునాదులు వేసిన నేతగా పేరున్న లాల్‌కృష్ణ అద్వానీ మాటలు ఇప్పుడు భారతీయ జనతా జార్టీ రాజకీయ శత్రువులకు వరప్రదంగా మారాయి. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదనో లేక మరోరకమైన అసంతృప్తితోనో కానీ.. అద్వానీ ఈ మధ్య ఒకింత ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. దేశంలో మళ్లీ ఎమెర్జెన్సీ రోజులు రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మాటలు మోడీని ఉద్దేశించినవేనని.. మోడీ తీరును తప్పుపట్టేవేననే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా అరవింద్ కేజ్రీవాల్ అద్వానీ వ్యాఖ్యానాలతో ఏకీభవించిన సంగతి తెలిసిందే.
మోడీ సర్కారు అంతా తాను అవ్వాలనుకొంటోందని.. ఢిల్లీ వేదికగా ఆ అజెండాను మోడీ అమలు పరుస్తున్నాడంటూ కేజ్రీవాల్ మీడియాకు ఎక్కాడు. ఈ విషయాన్ని వివరించడానికన్నట్టుగా అద్వానీతో సమావేశం కావడానికి కూడా ప్రయత్నించాడు కేజ్రీ.
మరి ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి శత్రువు వరసయ్యే మరో ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఈ అంశంపై పెదవి విప్పాడు. అద్వానీ మాటలతో ఈయన ఏకీభవించాడు. ఈ సారి బిహార్ ముఖ్యమంత్రి నితీస్‌కుమార్ వంతు వచ్చింది. ఈయన అద్వానీతో ఏకీభవించాడు. దేశంలో ఎమెర్జెన్సీ రోజులు వచ్చే అవకాశం ఉందన్న బీజేపీ సీనియర్ నేత మాటలతో తను ఏకీభవిస్తున్నానని నితీష్ అన్నాడు.
మోడీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతూ ఈ బిహారీ బాబు ఈ వ్యాఖ్యానాలు చేశాడు. మొత్తానికి అద్వానీ మాటలు ఈ విధంగా వీరందరికీ అస్త్రాలుగా ఉపయోగపడుతున్నట్టున్నాయి.