Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే !

By:  Tupaki Desk   |   11 Nov 2020 12:50 PM GMT
బ్రేకింగ్ : మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే !
X
తాజాగా జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం అందుకుంది. ఓట్ల లెక్కింపు మొదటి నుండి చివరి వరకు ఎంతో ఉత్కంఠరేపిన బిహార్ ఎన్నికల ఫలితాలలో చివరకు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తుంది. బిహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 మేజిక్ ఫిగర్‌ని దాటి స్పష్టమైన మెజారిటీతో 125 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. దీనితో బిహార్‌లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలో తిరిగి సీఎం నితీష్ కుమార్ ఐదోసారి అధికారం చేపట్టనున్నారు. అయితే , నిన్న కౌటింగ్ సమయంలో బీహార్ సీఎం మారబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి , అలాగే నితీష్ కేంద్ర కేబినెట్ లోకి వెళ్తారని, బీహార్ సీఎం గా మరొకరు వస్తారంటూ రకరకాల వార్తలు వచ్చాయి.

ఈ సమయంలో బీహార్ లో కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ప్రకటించారు. బీజేపీ ఎన్నికల ముందే ఈ హామీనిచ్చిందన్నారు. కాగా 69 ఏళ్ళ నితీష్ 7 వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్ ని తమ సీఎం అభ్యర్థిగా బీజేపీ మొదట ప్రకటించిందని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు. కమలం పార్టీ అధిష్టానం నిర్ణయమే ఇది అని చెప్పారు. ఇకపోతే ,బిహార్ ఎన్నికల ఫలితాల్లో పార్టీలు కైవసం చేసుకున్న స్థానాల సంఖ్యను పరిశీలిస్తే... బీజేపి-74, ఆర్జేడీ-75, జేడీయూ-43, ఎల్జేపీ-01, కాంగ్రెస్-19, సీపీఐఎంఎల్-11, సీపీఎం-02, సిపిఐ -02, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు.