Begin typing your search above and press return to search.
అరాచక పాలన ఉండదంటున్న సీఎం
By: Tupaki Desk | 21 Nov 2015 4:39 PM GMTబీహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హవాను తట్టుకొని మరీ విజయం సాధించిన జేడీయూ నేత నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల చూపును తనవైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ నేత లాలూతో జట్టుకట్టి విజయం సాధించిన నేపథ్యంలో ఇపుడు రాజకీయ విశ్లేషకులు బీహార్ భవిష్యత్ పాలన వైపు దృష్టిసారించారు. బీహార్ లో లాలూ హయాంలో జరిగిన జంగిల్ రాజ్ పాలన గురించి తమదైన శైలిలో విశ్లేషణలు మొదలుపెట్టారు.
బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తరువాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీహార్ సెక్రటేరియెట్ లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, ఆర్జేడీల తో కలిసి గ్రాండ్ సెక్యులర్ అలయెన్స్ గా ఏర్పడిన కూటమి బీహార్ లో విజయం సాధించినప్పటికీ పాలన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కేబినెట్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులిద్దరికీ కీలక పదవులు కట్టబెట్డడం పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలు సందేహాలను ఆయన కొట్టిపారేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్ర పక్షాలకు మంత్రిపదవులు ఇవ్వడం సహజమేనన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ఆయన హోంమంత్రిత్వ శాఖను తనవద్దే ఉంచుకున్నానని గుర్తు చేశారు. బీహార్ లో జంగిల్ రాజ్ భయాలు వద్దని అన్నారు. గతంలో తన నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పాలనకు పెద్దపీట వేసిందని...ఇదే రీతిలో ప్రస్తుతం సైతం పరిపాలన సాగిస్తామని చెప్పారు.
1.65 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో మంజూరు చేసిన నేపథ్యంలో బీహార్‌ను అభివృద్ధి బాటలో నడిపించడం నితీశ్ కు నల్లేరు మీద నడక అవుతుందని భావిస్తున్నారు. కేంద్రం నిధులను నితీశ్ సక్రమమైన మార్గంలో ఉపయోగిస్తే బీహార్ పురోగతి తేలిక అవుతుందని పేర్కొంటున్నారు.