Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిచ్చిన నితీశ్.. కూర్చోబెట్టానికి అంతలా బతిమిలాడాల్సి వచ్చిందే

By:  Tupaki Desk   |   1 Sep 2022 11:30 AM GMT
కేసీఆర్ కు షాకిచ్చిన నితీశ్.. కూర్చోబెట్టానికి అంతలా బతిమిలాడాల్సి వచ్చిందే
X
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. బీజేపీ ముక్త భారత్ అన్న కాన్సెప్టును పట్టుకొని వేర్వేరు రాష్ట్రాలకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతి తెలిసిందే. వినాయకచవితి పండుగ వేళ.. బిహార్ వెళ్లిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ తో పాటు.. ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తో సహా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ కావటం తెలిసిందే.

అయితే.. ఈ పర్యటనలో కేసీఆర్ కు దిమ్మ తిరిగే ఒక సీన్ ఎదురైన విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

పాట్నాలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ ను ప్రతిపాదిస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ఆయన్ను ప్రతిపాదించటానికి తానెవర్ని అని కేసీఆర్ విలేకరిని తిరిగి ప్రశ్నించారు.

ఈ సందర్భంలోనే కేసీఆర్ మాటలకు హర్ట్ అయ్యారో ఏమో కానీ.. ఆయన మాట తీరుకు రియాక్షన్ వెంటనే వచ్చింది. అప్పటివరకు కుర్చీలో కూర్చున్న నితీశ్.. కేసీఆర్ నోటినుంచి ఆ మాట వచ్చినంతనే ఆయన పైకి లేచి.. వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో.. మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్.. విలేకరులతో మాట్లాడటం ఆపి.. ఆయన్ను కూర్చోవాల్సిందిగా అభ్యర్థించారు.

సీఎం నితీశ్ లేవటంతో.. పక్కనే కూర్చున్న తేజస్వీ సైతం పైకి లేచారు. దాదాపు పదిహేనుసార్లు కూర్చొమన్న కేసీఆర్ రిక్వెస్టుతో నితీశ్ అతి కష్టమ్మీద కూర్చున్నారని చెప్పాలి. ఐదు నిమిషాలో మీడియా భేటీ ముగిస్తానని చెప్పిన కేసీఆర్ నితీశ్ ను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ నోటి మాటతోనే నితీశ్ ఆ తీరులో రియాక్టు అయ్యారని చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా బీజేపీయేతర రాష్ట్రాల్లోపర్యటిస్తున్న కేసీఆర్ కు బిహార్ లో మాత్రం అనూహ్య ఘటన ఎదురైందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.