Begin typing your search above and press return to search.
నిత్యానంద వివాదం: పోర్న్ వీడియోల్లో బుక్కైన పోలీసులు, అధికారులు
By: Tupaki Desk | 12 March 2020 1:30 AM GMTరాసలీలల తో పాపులర్ అయిన ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కేసు అనూహ్య మలుపు తిరిగింది. తాజాగా నిత్యానందపై నమోదైన అక్రమ నిర్బంధం కేసులో కోర్టు ఆదేశాల మేరకు 14మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది.
గుజరాత్ లో ని అహ్మదాబాద్ లో నిత్యానంద ఇద్దరు అమ్మాయిలు, ఓ బాలుడిని నిర్బంధించి శారీరకంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిత్యానందతోపాటు ఆయన శిష్యురాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే నిత్యానంద అనుచరుడు గిరీష్ కోర్టును ఆశ్రయించాడు. ఆశ్రయంలోని పిల్లల తో పోలీసులు, అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని.. పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిపై భౌతిక దాడి చేశారని ఆరోపించారు. అడగకూడని ప్రశ్నలు అడిగారని పిటీషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటీషన్ విచారించిన కోర్టు పోలీసుల తో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే 14మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
ప్రస్తుతం నిత్యానందం అజ్ఞాతంలో ఉన్నారు. కైలాస అనే దేశాన్ని సృష్టించి ఈక్వెడార్ దేశపు ద్వీపం లో ఉంటున్నట్టు తెలిసింది. దక్షిణ అమెరికా ఖండం పక్కన సముద్రం లో ద్వీపంలో తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది.