Begin typing your search above and press return to search.
రియల్ సామాన్యుడు..ఆ జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారంటే?
By: Tupaki Desk | 28 Dec 2019 5:03 AM GMTరీల్ లో చాలా క్యారెక్టర్లు చూస్తాం. ఇలాంటి వారు రియల్ గా ఉంటే ఎంత బాగుండన్న భావన కలుగుతుంది. తాజాగా అలాంటి ఫీలింగేలా కలిగేలా చేస్తున్నారునిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. రీల్ లో కనిపించే క్యారెక్టర్ ను రియల్ గా చూపిస్తున్న ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారుతోంది.
జిల్లాకు కొత్త కలెక్టర్ గా వచ్చిన నారాయణరెడ్డి తన ఎంట్రీలోనే అదరగొట్టేస్తున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సైకిల్ మీద బయలుదేరిన ఆయన ఎన్టీఆర్ చౌరస్తా.. కలెక్టరేట్ చౌరస్తా.. బస్టాండ్ మీదుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. చుట్టూ ఉండే మంది మార్బలం అన్నది లేకుండా.. సామాన్యుడిలా సైకిల్ ను స్టాండ్ లో పెట్టేసిన ఆయన ఆసుపత్రిలోకి వెళ్లారు.
అందరిలో ఒకడిగా వ్యవహరిస్తూ.. రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల కోసం ఉండే వారి బంధువుల వద్దకు వెళ్లి.. ఆసుపత్రిలో సిబ్బంది పని తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
స్కానింగ్ వద్ద పెద్ద ఎత్తున గుంపు ఉండటంతో ఎందుకు అలాంటి పరిస్థితి ఉందో అడిగి తెలుసుకున్న ఆయన.. నడవలేని స్థితిలో ఉన్న ఒక పెద్దాయనకు చేయూతను అందించి లిఫ్ట్ వరకూ తీసుకెళ్లారు. ఓపీ విభాగంలో రోగుల క్యూను పరిశీలించారు. ఇలా ఒక్కో విభాగాన్నిపరిశీలిస్తూ.. ఆసుపత్రిలో తిరుగుతున్న ఆయన గురించి తెలుసుకున్న వైద్యాధికారులు హడావుడిగా ఆసుపత్రికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు.
అనంతరం వైద్యధికారులతో సమావేశమైన ఆయన.. తాను స్నేహపూర్వకంగా ఉంటానని.. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటానని చెప్పారు. ఈ విషయంలో తేడా వస్తే చర్యలు తప్పవన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను నేరుగా వచ్చి కలవొచ్చన్నారు. ఆసుపత్రిలో మినరల్ వాటర్ కు అధికంగా ఛార్జీలు వసూలు చేయటాన్ని ప్రస్తావిసతూ.. ఎవరికైనా ఏమైనా సమస్యలుంటే తాను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను ఆసుపత్రికి వెళ్లే సమయానికి హాజరు కాని సిబ్బందికి మెమోలు ఇచ్చారు. సింఫుల్ గా ఉంటూనే పని పట్ల సీరియస్ గా ఉండటమే కాదు.. తానెంత సిన్సియర్ అన్న విషయాన్ని చేతల్లో చెప్పేసిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మాదిరి మిగిలిన వారూ ఉంటే.. వ్యవస్థలో మార్పు అంతో ఇంతో మొదలవుతుందని చెప్పక తప్పదు.