Begin typing your search above and press return to search.
చరిత్రలో నిలిచిపోయేలా నిజామాబాద్ ఎన్నిక
By: Tupaki Desk | 8 May 2019 11:08 AM GMT185మంది అభ్యర్థులు పోటీపడ్డారు.. 27వేల బ్యాలెట్ యూనిట్లు.. వేల మంది పోలింగ్ సిబ్బంది, అధికారులు, పోలీసులు.. ఇలా దేశంలోనే అతిపెద్ద ఎన్నికను అంతే సవాల్ గా తీసుకొని విజయవంతంగా పూర్తి చేశారు.. ఇప్పుడు అంతే కసితో పోలింగ్ కు సిద్ధమవుతున్నారు.. అదే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక..
దేశంలోనే అతిపెద్దదిగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఈసీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం 185మంది అభ్యర్థులు పోటీచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత టీఆర్ ఎస్ నుంచి పోటీచేయడంతో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని నిరసించిన నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతులు ఆమెపై 178మంది పోటీచేశారు. ఇక బీజేపీ నుంచి డీ. అరవింద్, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ కూడా పోటీపడ్డారు. ఇంత మంది బరిలో నిలవడం దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదే ప్రప్రథమం.
కానీ ఎన్నికల కమిషన్ సవాల్ గా తీసుకొని బ్యాలెట్ పై కాకుండా ఈవీఎంలనే పెట్టే పూర్తి చేసింది. ఒక్కో పోలింగ్ బూత్ లో 12 ఈవీఎంలను ఒకదానికొకటి అనుసంధానించి ఈ అతిపెద్ద పోలింగ్ ను ఏప్రిల్ 11న పూర్తి చేశారు. ఇక సాధారణంగా పోలింగ్ ఫలితాల లెక్కింపునకు 14 టేబుల్స్ వాడుతారు. కానీ ఈ పెద్ద ఎన్నిక కోసం 18 టేబుల్స్ వాడుతున్నారు.
అయితే సంఖ్య పరంగా అతిపెద్ద ఎన్నిక కావడంతో దీన్ని గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని ఈసీ అధికారులు ఇప్పటికే వివరాలు పంపించారు. ఇక ఇప్పుడు దీన్ని కేస్ స్టడీగా చెప్పాలంటూ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)ని తెలంగాణ ఎన్నికల అధికారులు సంప్రదించారు. వాళ్లు గనుక స్వీకరిస్తే దేశవ్యాప్తంగా నిజమాబాద్ ఎన్నిక ఒక పాఠంగా విద్యార్థులందరూ చదువుతారు. ఈసీ సామర్థ్యాన్ని.. అతిపెద్ద ఎన్నికల నిర్వహణనను.. రైతుల నిరసనను దేశప్రజలంరదికీ తెలిపే అవకాశం ఉంటుంది. భావి భారత విద్యార్థులకు దీనిపై అవగాహన ఉంటుంది.