Begin typing your search above and press return to search.

బైక్ ను ట్రాలీగా భ‌లేగా మార్చాడుగా?

By:  Tupaki Desk   |   14 July 2019 5:30 AM GMT
బైక్ ను ట్రాలీగా భ‌లేగా మార్చాడుగా?
X
కొంత‌మంది ఐడియాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. వినూత్నంగా ఉండే వారి ఆలోచ‌న‌లకు ఫిదా కావాల్సిందే. మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు చేసిన ప‌ని ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయ ప‌నుల కోసం ఎడ్ల‌బండిని వినియోగించేవారు. త‌ర్వాతి కాలంలో ట్రాక్ట‌ర్లు ఎంట్రీ ఇచ్చాయి. అయితే.. పెరిగిన వ్య‌వ‌సాయ ఖ‌ర్చుల‌కు కోత పెట్టేందుకు వీలుగా బైకునుట్రాలీగా మార్చిన వైనం చూస్తే నోట మాట రాదంతే.

స‌ద‌రు రైతు తెలివికి ముచ్చ‌ట‌ప‌డాల్సిందే. ఇటీవ‌ల కాలంలో ర‌వాణా ఛార్జీలు భారీగా పెరిగిపోవ‌టం.. గ‌తంలో మాదిరి వ్య‌వ‌సాయ‌కూలీలు దొర‌క‌ని వేళ‌.. వారిని మాట్లాడుకోవ‌టం.. పొలం వ‌ద్ద‌కు త‌ర‌లించ‌టంపెద్ద క‌ష్టంగా మారింది. ర‌వాణాకు ఖ‌ర్చు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో కొత్త ఆలోచ‌న చేశారు రెంజ‌ల్ గ్రామానికి చెందిన రైతు భాస్క‌ర్ రెడ్డి.

త‌న బైకుకు.. 4/8 అడుగులు వెడ‌ల్పు.. పొడ‌వుతో మినీ ట్రాక్ట‌ర్ పోలిన ట్రాలీని త‌యారు చేయించారు. దాన్ని త‌న టూవీల‌ర్ కు బిగించారు. బైకు మీద తాను.. మ‌రొక‌రిని వెనుక కూర్చొబెట్టుకొని.. బైకుకు ట్రాలీని జాయింట్ చేసి సాగిపోతున్న తీరు చూస్తే.. వాటే ఐడియా అన‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ఈ ట్రాలీ త‌యారీకి రూ.20వేలు ఖ‌ర్చు అయిన‌ట్లుగా చెబుతున్నారు. దాదాపు ఐదారుగురు చ‌క్క‌గా కూర్చేనేందుకు వీలుగా ఉన్న ఈ ట్రాలీని రూపొందించిన ఐడియాను ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా చూస్తే రియాక్ట్ కావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.