Begin typing your search above and press return to search.
థ్రిల్లర్ ని తలపించేలా ఫేస్ బుక్ ప్రేమ కథ..!
By: Tupaki Desk | 15 Aug 2020 1:30 AM GMTకాలం మారిపోయింది. లైగింక సుఖం కోసం ఆడా - మగా అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు వావివరసలు మరచి సంబంధాలు పెట్టుకుంటుండగా, కొందరు తమ సుఖానికి అడ్డు ఉన్న వారిని అంతమొందిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడితో ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వివాహిత ఫేస్ బుక్ ద్వారా ప్రేమాయణం సాగించి డబ్బు కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేయించింది.
ఈ సంఘటన సంచలనం సృష్టించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వర్ని పోలీసు స్టేషన్ పరిధి జలాల్ పూర్ కు చెందిన అశ్వాక్(24) కు ఫేస్ బుక్ లో ఉత్తరప్రదేశ్ కు చెందిన 28 ఏళ్ల వివాహిత పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అశ్వాక్ పలు సార్లు యూపీకి వెళ్లి ఆమెను కలిశాడు. నిన్ను విడిచి ఉండలేనని, తనను ఇంటి నుంచి తీసుకెళ్లాలని ఆమె ఆ యువకుడిని కోరింది. ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న ఓ కారును అద్దెకు మాట్లాడుకున్న అశ్వాక్ యూపీ కి వెళ్ళాడు.
అయితే బయటికి వెళ్తే బతికేందుకు డబ్బు ఎలా అని వారిద్దరికీ ప్రశ్న తలెత్తింది. ఆ మహిళ ఓ ప్లాన్ వేసి తన కుమారుడిని కిడ్నాప్ చేసి - భర్త నుంచి డబ్బు వసూలు చేయాలని ప్రియుడికి సూచించింది. ఆమె చెప్పినట్లు ఆ యువకుడు వివాహిత కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూ ఆమె భర్తకు ఫోన్ చేశాడు. అయితే అతడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె ప్రియుడికి సమాచారం ఇవ్వగా అతడు బాలుడిని వదిలేసి పారిపోయాడు. ఈ కథ ఇంతటితో ముగిసింది అనుకున్న యువకుడికి యూపీ పోలీసులు షాక్ ఇచ్చారు. అశ్వాక్ సెల్ నెంబర్ ని ట్రేస్ చేసి వర్నికి చేరుకుని స్థానిక పోలీసుల సాయంతో అశ్వాక్ ని అరెస్టు చేశారు. విచారణలో అతడు వివాహితతో తన ప్రేమ విషయం గురించి, కిడ్నాప్ గురించి చెప్పాడు. పోలీసులు అతడిని, కారు డ్రైవర్ ని అరెస్టు చేసి యూపీకి తీసుకెళ్లారు. డబ్బు కోసం వివాహిత ప్రియుడితో కలసి కన్న బిడ్డనే కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది.