Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే బూతులుః'హౌలేగా..నాలుక చీరేస్తా..!
By: Tupaki Desk | 2 Oct 2017 8:00 AM GMTతెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరొకరు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వర్సెస్ అధికారులు అన్నట్లుగా విమర్శల జోరు కొనసాగుతున్న సమయంలో...తాజాగా సామాన్య పౌరుడు ఒకరిని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే - నిజామాబాద్ శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా బండబూతులు తిట్టిన ఉదంతం వెలుగులోకి రావడం అధికార పార్టీలో కలవరానికి దారితీసింది. అందులోనూ సదరు వ్యక్తి వేరే పార్టీకి చెందిన కార్యకర్త కావడం గమనార్హం. ఆ ఎమ్మెల్యేగారి తిట్ల దండకం ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
బాధితుడి కథనం ప్రకారం....దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని దేవిరోడ్డులో గల దేవి ఆలయం నుంచి ఆదివారం శోభాయాత్ర నిర్వహించ తలపెట్టారు. నిర్వాహకులకు డీజే కొనసాగించడానికి పోలీసుల అనుమతి లభించలేదు. దానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తానే కారణమంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం ఆనోటా ఈనోటా ఎమ్మెల్యే వద్దకు చేరింది. ప్రభాకర్ గుప్తా అనే వ్యక్తికి అదేరోజు రాత్రి ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఫోన్ చేశారు. అతనిపై తన తిట్ల దండకాన్ని ఎక్కుపెట్టాడు. ``హలో....ప్రభాకరా.. డెకరేషన్ ప్రభాకరా. ఏం...బలిసిందా. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నవట. డీజే పర్మిషన్ నేను ఆపించానా? తలకాయ తిరుగుతుందా? చాలా రోజుల నుంచి చూస్తున్న నీ కథలు.
నాలుక చీరేస్తా.. కాళ్లు విరగ్గొడతా బోసిడికే.. బాడ్ కావ్.. తమాషా చేస్తున్నావా? నాతో పెట్టుకున్నవంటే గు....పలగ్గొడతా..``అంటూ ఇంకొన్ని బూతు పదాలతో తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.
తాను ఓ ఎమ్మెల్యే అన్న విషయాన్నే మరిచి నోటిదురుసును పారేసుకున్న ఉదంతం తాలుకు ఆడియో క్లిప్ శనివారం అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారిపోయింది. ఓ ప్రజాప్రతినిధి అయివుండి ఇలాంటి భాష ఉపయోగించడం పట్ల స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే తీరు పట్ల ఆవేదనకు గురైన బాధితుడు - అనుచరులు తమ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. మరోవైపు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా స్థానిక మీడియాకు వివరించారు. తానెవరితోనూ ఫోన్ లో మాట్లాడలేదని... ఆ ఆడియోకు, తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. అనవసరంగా నిందారోపణలు సరికాదని...తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.