Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి పాజిటివ్..!
By: Tupaki Desk | 15 Jun 2020 12:10 PM GMTతెలంగాణలో వైరస్ విజృంభణ రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ఈ మహమ్మారి ప్రజా ప్రతినిధులను సైతం వదిలిపెట్టడంలేదు. నిన్న మొన్నటి వరకు ప్రజా కార్యక్రమాల్లో చురుక్కుగా పాల్గొన్న నేతలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు వైరస్ పాజిటివ్ గా వచ్చిందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది.ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వైరస్ సోకడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాలతో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకున్నారని , ఆ పరీక్షల్లో అయనకి పాజిటివ్ వచ్చింది అని అంటున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అవ్వడం వల్లే వైరస్ సోకి ఉండచ్చు అనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఈ వైరస్ భారిన పడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.