Begin typing your search above and press return to search.
ఏపీ మండలికి కొత్త ఛైర్మన్ వచ్చేశారు
By: Tupaki Desk | 15 Nov 2017 10:41 AM GMTఏపీ శాసన మండలికి కొత్త ఛైర్మన్ వచ్చేశారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత.. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఎన్ఎండీ ఫరూక్‌ను మండలి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఫరూక్‌కు మండలి ఛైర్మన్ గా అవకాశం ఇస్తానని ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు మాట ఇచ్చారు.
ఇచ్చిన మాటకు తగ్గట్లే ఫరూక్‌కు కొత్త బాధ్యతలు అప్పజెప్పారు. ఫరూక్‌ను మండలి నేత కమ్ రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణ.. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పీఠం వద్దకు తీసుకెళ్లారు.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. మైనార్టీ నేతగా పేరున్న ఆయన.. 2004 నుంచి సరైన బ్రేక్ రాలేదు. మంత్రి పదవిని మరోసారి చేపట్టాలన్న ఆశ ఉన్న ఫరూక్ కు ఆ అవకాశం దక్కలేదు. అయితే.. మండలి ఛైర్మన్ గా అవకాశం ఇస్తానంటూ బాబు ఇచ్చిన మాటకు తగ్గట్లే తాజాగా ఆయనకు పదవిని చేపట్టే అవకాశం ఇచ్చారు. మండలి ఛైర్మన్ గా ఫరూక్‌ను ఎంపిక చేసిన చంద్రబాబు.. అసెంబ్లీ.. మండలిలో చీఫ్ విప్.. విప్ లను కూడా ఖరారు చేశారు.
అసెంబ్లీలో చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డి.. మండలిలో చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ కు అవకాశం కల్పించారు. అదే సమయంలో అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న నలుగురు విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. అలా ఛాన్స్ చేజిక్కించుకున్న వారిలో గణబాబు.. సర్వేశ్వరరావలను నియమించారు. మండలి విప్ లుగా బుద్దా వెంకన్న.. డొక్కా మాణిక్య వరప్రసాద్‌లకు అవకాశం కల్పించారు. దీంతో.. కొంత కాలం క్రితం బాబు ఇచ్చిన హామీలు టోకుగా అమలైనట్లుగా చెప్పాలి.