Begin typing your search above and press return to search.
అదానీ క్లారిటీ ఇచ్చాడు ! ఊపిరి పీల్చుకో జగన్ !
By: Tupaki Desk | 15 May 2022 1:23 PM GMTప్రముఖ పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రాజ్యసభకు పోటీ చేసే విషయమై ఓ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తన భార్య ప్రీతీ అదానీ పేరును వైసీపీ ప్రతిపాదించిందని వస్తున్న వార్తలను తోసి పుచ్చుతూ ఈ విషయమై తనదైన శైలిలో ఓ ప్రకటన రూపంలో మీడియాకు సమాధానం ఇచ్చారు. తాము ఏ రాజకీయ పార్టీలో చేరాలని, చేరి పదవులు పొందాలని అనుకోవడం లేదని స్పష్టం చేస్తూ ఓ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. తమ విషయమై తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను కానీ తన భార్య కానీ అటువంటి పదవుల విషయమై ఎటువంటి ఆసక్తితో లేమని తేల్చేశారు. దీంతో వైసీపీ అధినాయకత్వంతో పాటు మరికొందరు ఆ పార్టీ ఆశావహులు ఊపిరి పీల్చుకోవచ్చు ఇక !
వాస్తవానికి ఏపీ సర్కారుతో వ్యాపార రీత్యా మంచి అనుబంధాలే నడుపుతున్నారు గౌతమ్ అదానీ. ఏపీలో కీలక పోర్టు కాంట్రాక్టులు అన్నీ అదానీవే ! ఇదే విషయమై ఆరోపణలు వచ్చినా కూడా జగన్ వాటిని పట్టించుకోలేదు. గతంలో అంబానీ గ్రూపులకు చెందిన వ్యక్తి పరిమళ్ నత్వానినీ మచ్చిక చేసుకుని, చేరువ చేసుకుని ఆయన్నుసైతం రాజ్యసభకు పంపారు. కొన్ని వ్యాపార లావాదేవీల్లో కొన్ని ఆర్థిక ప్రయోజనాలు వైఎస్ జగన్ సంస్థలు పొందినందునే ఈ గుజరాతీ పెద్దాయనకు రాజయోగం దక్కిందని అప్పట్లో టీడీపీ ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కౌంటర్లు ఇస్తూ సుజనా చౌదరిని ఉదహరిస్తూ బాబు వర్గాన్ని నిలువరించే ప్రయత్నం ఒకటి వైసీపీ చేసింది.
ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల్లో భాగంగా రాజ్యసభకు పంపే నలుగురు అభ్యర్థులు ఎవరు అన్నది కొంత సంశయాత్మకంగానే ఉంది. గౌతమ్ అదానీ గ్రూపులకు చెందిన ఏ ఒక్కరూ అటుగా వెళ్లే ఛాన్స్ లేదని తేలిపోయింది. మరి ! పారిశ్రామిక వర్గాలకు చెందిన వ్యక్తికి ఇస్తారా లేదా మంత్రి విడదల రజనీ కోసం సీటు త్యాగం చేసిన కమ్మ సామాజికవర్గం ప్రతినిధి మర్రి రాజశేఖర్ కు ఇస్తారా లేదా వీళ్లెవ్వరూ వద్దని దళిత సంఘాల ప్రతినిధి జూపుడికి ఛాన్స్ ఇచ్చే వీలుందా ? ఏమో గుర్రం ఎగురా వచ్చు.