Begin typing your search above and press return to search.
కేంద్ర న్యాయశాఖా మంత్రి మాత్రం నో అంటున్నారు
By: Tupaki Desk | 25 Jun 2015 8:38 AM GMTహైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుకు సంబంధించి ఇరురాష్ట్రాల మధ్య పరిస్థితి హాట్..హాట్‌గా మారటం తెలిసిందే. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ అధికారపక్షం నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ స్పందనతో పోలిస్తే.. అటార్నీ జనరల్ నుంచి లేఖ వచ్చిందన్న వార్తలు మీడియాతో రావటంతో పరిస్థితి మొత్తం మారిపోవటం తెలిసిందే.
సెక్షన్ 8 అమలుకు సంబంధించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి మొదలు..పలువురు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి సదానందగౌడ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ తమను అభిప్రాయం కోరినప్పుడు మాత్రమే తాము ఏదైనా అంశానికి స్పందిస్తామని.. తనకు తెలిసినంత వరకు సెక్షన్ 8 మీద తమ శాఖ ఎలాంటి వ్యాఖ్య చేయలేదని.. మరెలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్న వాదనను వినిపించారు.
ఒకవేళ సదానంద గౌడ్ మాట నిజమే అనుకుంటే.. మరి.. మీడియాలో వచ్చిన లేఖ మాటేమిటి? గవర్నర్‌ను మైడియర్ నరసింహన్ అంటూ అటార్నీ జనరల్ రాసినట్లుగా చెప్పిన లేఖ.. అందులోని సారాంశం సంగతేమిటన్న ప్రశ్న ఒకటి అయితే.. ఒకవేళ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేనిపక్షంలో తెలంగాణ అధికారపక్షం అంత తీవ్రస్థాయిలో స్పందిస్తుందా? అన్నది మరో ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేవారు ఎవరు?