Begin typing your search above and press return to search.
అడిగింది చంద్రబాబు.. ఇచ్చింది గుజరాత్ కు
By: Tupaki Desk | 25 Feb 2016 9:16 AM GMTఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత నారా చంద్రబాబు నాయుడు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా ఆయన ఏం అనుకుంటే అది జరిగేది. రైల్వే - ఆర్థిక బడ్జెట్లు వచ్చినపుడు బాబు ప్రతిపాదనలకు పెద్ద పీట వేసేవాళ్లు. కానీ ఇప్పుడు కూడా ఎన్డీఏలో బాబు భాగస్వామే కానీ.. ఆయన మాటకు విలువ లేదు. పోయినసారి ఆయన చాలా విజ్నప్తులు చేశారు. కానీ రైల్వే బడ్జెట్ లో కానీ.. రెగ్యులర్ బడ్జెట్ లో కానీ ఆయన మాటను పట్టించుకోలేదు. కనీసం ఈసారైనా దయ చూపండంటూ చాలా ప్రతిపాదనలు పెట్టారు బాబు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పట్టించుకోలేదు మోడీ సర్కారు. కనీసం ఈ ప్రతిపాదన ప్రస్తావన కూడా తేలేదు మంత్రి సురేష్ ప్రభు. విశాఖను ఈసారైనా రైల్వే జోన్ గా ప్రకటిస్తారేమో అనుకుంటే నిరాశ తప్పలేదు.
ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిలో రైల్వే యూనివర్శిటీ పెట్టిస్తానని ఆ మధ్య ప్రకటన చేసిన చంద్రబాబు.. ఈ మేరకు కేంద్రానికి విజ్నప్తి చేశారు. అది కూడా పట్టించుకోలేదు ప్రభు. ఐతే చంద్రబాబు అడిగిందాన్ని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పెట్టబోతున్నట్లు ప్రకటన చేయడం విశేషం. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. ఇక దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న రైల్వే ఆటో హబ్ ను తమిళనాడు రాజధాని చెన్నైకి కేటాయించారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఇది తాయిలం అనుకోవచ్చు. ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాలు రెండింటికీ బడ్జెట్ లో మొండిచేయే చూపించారు. ఒక్క కొత్త రైలు సర్వీసు దక్కలేదు. సుదీర్ఘకాలంగా ఉన్న ప్రతిపాదనలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. తెలంగాణ సర్కారు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని మాత్రమే రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ఇది ఆల్రెడీ నడుస్తున్న ప్రాజెక్టే కాబట్టి కొత్తగా సంతోషించాల్సిందేమీ లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. తిరుపతి రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తామని ఒక మొక్కుబడి హామీ ఇచ్చారు.