Begin typing your search above and press return to search.

సర్కార్ ఆస్పత్రుల్లో బెడ్స్ నిల్ .. ప్రైవేట్ లో బిల్స్ ఫుల్ !

By:  Tupaki Desk   |   14 Sept 2020 3:00 PM IST
సర్కార్ ఆస్పత్రుల్లో బెడ్స్ నిల్ .. ప్రైవేట్ లో బిల్స్ ఫుల్ !
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,417 కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు .. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కి చేరుకుంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 974కి పెరిగింది. గత 24 గంటల్లో 13 మంది కరోనాతో చనిపోయారు. అలాగే , వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూలై 27న మొదటిసారి బులెటిన్ ‌లో వెంటిలేటర్ల సంఖ్య, వాటిపై చికిత్స పొందుతున్నవారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి వెంటిలేటర్లపై ఎంత మంది చికిత్స తీసుకుంటున్నారు.

జూలై 27వ తేదీన ప్రైవేటు ఆస్పత్రుల్లో 472 మంది, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 272 మంది వెంటిలేటర్‌ చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 744 మంది చికిత్స తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆ సంఖ్య 1579కి పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న ఐసీయూ బెడ్లు 3,304 ఉన్నాయి. అందులో ఇప్పటికే 1579 నిండిపోయాయి. ఆగస్టు 1 నాటికి 42 శాతంగా ఉన్న వెంటిలేటర్‌ పడకల ఆక్యుపెన్సీ, ప్రస్తుత 47 శాతానికి పెరిగింది. దీనికి ప్రధాన కారణం జిల్లాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడమే. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆలస్యంగా ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో వారికి వెంటిలేటర్‌‌పై చికిత్స అవసరం అవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న ఐసీయూ బెడ్లు మొత్తం నిండిపోయాయి. దీనితో ఆ చోట్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎవరికైనా వెంటిలేటర్‌ అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి 500 పడకలకు ప్రస్తుతం 445 ఫుల్‌ అయ్యాయి. మొత్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ల్లో 1224 వెంటిలెటర్స్‌ అందుబాటులో ఉండగా అందులో 670 మంది రోగులు ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 2078 వెంటిలెటర్స్‌ ఉంటే అందులో 909 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి ప్రైవేటు ఆస్పత్రుల్లో 1980 వెంటిలెటర్స్‌ బెడ్స్‌ ఉండగా.. 833 మంది చికిత్స తీసుకుంటున్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో 1224 బెడ్స్‌కుగాను 668 మంది చికిత్స పొందుతున్నారు.