Begin typing your search above and press return to search.
‘కేంద్రంతో సత్సంబంధాలు’ అనడం ఓ బూటకం!
By: Tupaki Desk | 5 Feb 2018 4:05 AM GMTచంద్రబాబు నాయుడు పదేపదే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించకుండా రాష్ట్రప్రయోజనాలు ఎలా సాధిస్తాం. రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే వారినుంచి నిదులు రాబట్టుకోగలం.. రాష్ట్రంకోసం భాజపాతో కలిసి ఉన్నామే తప్ప.. నాకు మరో ఉద్దేశం లేదు. కేంద్రం నుంచి తెదేపా బయటకు రావాలని కోరుకుంటున్న వారు.. మేం కూడా బయటకు వచ్చేస్తే ఇక రాష్ట్రానికి నిధులు ఎలా వస్తాయో చెప్పాలి.. అంటూ రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే తాను ఏం పని చేస్తే .. ఆ పనిని సమర్థించుకోవడానికి చంద్రబాబునాయుడు వద్ద ఓ పటిష్టమైన వాదన ఉంటుంది. కానీ ఇవాళ ప్రజల దృష్టిలో... ఇలా ‘‘రాష్ట్రం కోసమే కేంద్రంతో సత్సంబంధాలు’’ అనే మాట పెద్ద కామెడీ కింద తయారవుతోంది.
ఎందుకంటే.. ఈ మాట పెద్ద కామెడీ అనే సంగతి రెండు రకాలుగా నిరూపణ అవుతోంది.
ఒకటో రకం.. సత్సంబంధాలు అనడం ద్వారా చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో సాధించింది అంటూ ఏమీలేదు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు మోడీని ఆహ్వానిస్తే ఆయన మన మొహాన గుప్పెడు మట్టికొట్టి - మన ఆశలపై చెంబుడు నీళ్లు చల్లి వెళ్లారు. కోర్ కేపిటల్ శంకుస్థాపన అని అరుణ్ జైట్లీని పిలిస్తే.. ఆయన అంతకంటె ఘోరంగా అది కూడా విదిలించకుండా వెళ్లారు. ఆ తర్వాతనైనా రాష్ట్రానికి ఏమైనా కేటాయింపుల గురించి పట్టించుకుంటున్నారా అంటే అది కూడా లేదు. ఈ రకంగా మిత్రత పాటించడం వల్ల ఏమీ సాధించలేకపోవడం ఒక కారణం.
అదేసమయంలో రెండో కారణం ఇంకా బలమైనది – కేంద్రంలో ఉన్న భాజపాతో ఏ మాత్రం సఖ్యత పాటిస్తున్నది గనుక.. ఇవాళ బెంగుళూరు నగరానికి 17 వేల కోట్ల రూపాయలతో సబర్బన్ రైల్వే వ్యవస్థను కేంద్రం మంజూరు చేసింది. కన్నడ సీఎం నిత్యం మోడీని ఎడాపెడా తిడుతూనే ఉంటారు. అయినా నిధులు వారికే వచ్చాయి. కేంద్రంతో ఏం సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు గనుక ఇవాళ తమిళనాడుకు వేల వేల కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అనేది ప్రజల మదిలో మెదలుతున్న సందేహం.
చంద్రబాబునాయుడు తాను చేయదలచుకున్నది చేస్తారని.. ఏం చేసినా సరే.. అది కేవలం ప్రజలకోసమే అని తన చేతల చుట్టూ ఓ అందమైన వాదన సృష్టించుకుని మాయ చేస్తుంటారని ఇలాంటి పరిణామాలను గమనించిన ప్రజలు విమర్శలు చేస్తున్నారు.