Begin typing your search above and press return to search.
ప్రచారం కాదు బాబు సాధించింది ఏంటో చెప్పండి
By: Tupaki Desk | 24 Feb 2018 5:21 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ వేదికగా మరోమారు ఏపీ సర్కారు హడావుడి మొదలుకానుంది. సీఐఐ సమన్వయంతో ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించే భాగస్వామ్య సదస్సు నేటి నుంచి మూడురోజుల పాటు జరగనుంది. అయితే ఈ సదస్సు ఫలితాల సాఫల్యతపై సందేహాలు ముసురుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు భాగస్వామ్య సదస్సులు జరిగాయి. రెండు సదస్సులకు సుమారు 50 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అంబానీ - టాటాలు సైతం సదస్సుకు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. అయతే, గడచిన రెండు సదస్సులలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఎన్ని సాకారమయ్యాయన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతుండటం గమనార్హం.
రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో లోపం కనిపిస్తోందని...పైగా సాధించిన దానికంటే ప్రచారం చేసుకుంటున్నది వందల రెట్లు అధికంగా ఉందని అంటున్నారు. 2016లో జరిగిన భాగస్వామ్య సదస్సులో 3.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2017లో దాదాపూ ఏడు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు వచ్చాయని - లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. అయితే, అనుకున్న స్థాయిలో పెట్టుబడులు రాకపోవడం గమనార్హం. పైగా అడ్రస్ లేని కంపెనీలతో ఎంఓయూ వేలాది ఉద్యోగాల ప్రకటనలు ప్రభుత్వం పరువును గంగపాలు చేశాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించినట్టుంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి వేల కోట్లలో కూడా పెట్టుడులు రాలేదన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రభుత్వం శనివారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో నిఖార్సయిన కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలాగే, 400 ఎంఓయూలపై మాత్రమే సంతకాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ప్రకటనల్లో భారీతనం ఏ మాత్రం తగ్గలేదని పలువురు అంటున్నారు. ఈ భాగస్వామ్య సదస్సుల వలన రాష్ట్రానికి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని - 22 లక్షల మందికి ఉపాధి లభించిందని చెపుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2016లో జరిగిన ఎంఓయూలలో జీ1 కేటగిరిలో 42.85 శాతం ఎంఓయూలు, 35.16 శాతం పెట్టుబడులు, 11.13 శాతం ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించారు. జీ-2 కేటగిరిలో 10 శాతం ఎంఓయులు, 1.03 శాతం పెట్టుబడులు, 1.39 శాతం ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.