Begin typing your search above and press return to search.

రెమిడెసివిర్‌ తో ప్రయోజనం లేదు , ఇవ్వకండి : డబ్ల్యూహెచ్‌ వో !

By:  Tupaki Desk   |   20 Nov 2020 12:50 PM GMT
రెమిడెసివిర్‌ తో ప్రయోజనం లేదు , ఇవ్వకండి : డబ్ల్యూహెచ్‌ వో !
X
కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వేల కొద్ది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయినా కూడా సరైన వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పటికి వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. అయితే , ప్రస్తుతం కరోనా పేషేంట్స్ కి ఎక్కువగా ఇచ్చే వ్యాక్సిన్ యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌. అయితే , ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ పై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న రెమిడెసివిర్‌ ను కరోనా బాధితులకి ఇవ్వొద్దని, కరోనా సోకిన వ్యక్తి ఎంతటి అనారోగ్యానికి గురైనప్పటికీ.. ఈ డ్రగ్ ఇవ్వొద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కరోనా వ్యాధిపై ఇది ప్రభావం చూపుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని , రికవరీ రేటు, వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గించడంలో రెమిడెసివిర్‌ పెద్దగా ఆశాజనక ఫలితాలేమీ ఇవ్వడం లేదని చెప్పింది. కరోనా ‌తో ఆస్పత్రిలో చేరిన ఏడు వేల మందిపై జరిపిన అధ్యయన వివరాల్ని పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ వో తెలిపింది. అయితే, రెమిడెసివిర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలూ లేవని చెప్పడం మాత్రం తమ ఉద్దేశం కాదని అధ్యయనాన్ని పర్యవేక్షించిన ప్యానెల్‌ వెల్లడించింది. కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంలో రెమిడెసివిర్‌ బాగా పనిచేస్తోందని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా సహా ఐరోపా దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు దీన్ని వినియోగించడానికి అనుమతి లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం దీన్ని వినియోగించారు. అయితే , ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం.