Begin typing your search above and press return to search.
యోగీ మళ్లీ ఇలా వార్తల్లోకి వచ్చారు
By: Tupaki Desk | 5 July 2017 4:56 PM GMTతనదైన శైలిలో పరిపాలనలో ముందుకు సాగుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనవసర ఖర్చులకు నో చెప్పి మరోసారి ఆదర్శంగా నిలిచారు. తనతోపాటు తన కాన్వాయ్ కోసం రెండు కొత్త మెర్సిడీజ్ బెంజ్ ఎస్ యూవీలను కొంటామన్న అక్కడ ఎస్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మాజీ సీఎం అఖిలేష్ వాడిన బెంజ్ కారే తనకు చాలని, కొత్తవి అవసరం లేదని యోగి స్పష్టంచేశారు. ఆయన నిర్ణయం వల్ల ఖజానాకు రూ.5 కోట్ల భారం తప్పింది.
యోగికి భిన్నంగా గతంలో ఉన్న అఖిలేష్, మాయావతి మాత్రం అధికారంలోకి రాగానే ఖరీదైన కార్లకు ఆర్డర్లు ఇచ్చారు. ఎస్పీ ప్రభుత్వంలో అయితే సీఎం అఖిలేష్‌కు తీసుకున్న కారునే అప్పటి ఎస్పీ చీఫ్ ములాయంకు కూడా ఇచ్చారు. ప్రభుత్వం దిగిపోగానే అఖిలేష్ తన కారును తిరిగి ఇచ్చేయగా.. ములాయం మాత్రం అందులోనూ తిరుగుతున్నారు. ఆయన నుంచి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ భావించినా.. సీఎం యోగి అడ్డు చెప్పారు. ములాయం పెద్దవారని, అలాంటి వ్యక్తి నుంచి బలవంతంగా తీసుకోవడం సరి కాదని, ఆయనే ఇచ్చే వరకు వేచి చూడాలని అధికారులకు యోగి స్పష్టంచేశారు.
కేవలం తనవరకే కాకుండా మంత్రులకు టొయోటా ఫార్చునర్ కార్లు తీసుకోవాలన్న ప్రతిపాదనను కూడా యోగి తిరస్కరించారు. వాళ్లు టొయోటా ఇన్నోవా చాలని చెప్పారు. ఫార్చునర్ ఒక్కోదానికి రూ.31 లక్షల వరకు అవుతుండగా.. ఇన్నోవా అందులో సగం మొత్తంతో వచ్చేస్తుంది. కాగా, తాజాగా యోగి తీసుకున్న ఈ నిర్ణయం మరోమారు ఆయన ప్రత్యేకతను చాటిందని అంటున్నారు.