Begin typing your search above and press return to search.
లోకేష్ పాదయాత్ర మీద పెద్దగా హోప్స్ లేవు : టీడీపీ వర్గాలు
By: Tupaki Desk | 19 Sep 2022 12:30 PM GMTతెలుగుదేశం పార్టీ భావినాయకుడు నారా లోకేష్ వచ్చే ఏడాది జనవరి 26 నుంచి పాదయాత్రకు రెడీ అవుతున్నారు అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అయితే లోకేష్ మీద పెద్దగా పాజిటివ్ అభిప్రాయం లేదు అని అంటున్నారు. ఇక టీడీపీలో లోకేష్ పాదయాత్ర మీద పెద్ద కసరత్తే తెర వెనక జరుగుతోంది అని అంటున్నారు. పార్టీలో ఎవరికైనా సీట్లు కావాలీ అంటే లోకేష్ పాదయాత్రను జయప్రదం చేయలని హుకుం జారీ చేస్తున్నారుట.
ఇక తెలుగుదేశంలో ఈ రోజుకీ చంద్రబాబే సర్వ సహా నాయకుడు. ఆయన నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది. నిజంగా చెప్పాలంటే బాబు నాయకత్వ లక్షణాలు కలిగిన నేత అని విపక్షాలు సైతం అంగీకరిస్తాయి. ఇక బాబు తన నాయకత్వ పటిమతో టీడీపీని ఎన్టీయార్ నుంచి వేరు చేసి గత ఇరవై ఏడేళ్లుగా భుజాల మీద మోస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.
ఆయన టీడీపీలో ఎన్టీయార్ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు కూడా తనదైన వ్యూహాలతో రాజకీయ చాతుర్యంతో రాణించారు. బాబు టీడీపీ లో కంటే ముందే ఒక నాయకుడిగా తనను తాను రుజువు చేసుకున్నారు. ఆయన 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. దానికి ముందు విద్యార్ధి రాజకీయలలో కూడా బాబు మార్క్ ఉంది. ఆయన నిజంగా లీడర్ అంటే తాను అని పలుమార్లు చాటుకున్నారు.
ఇక లోకేష్ కి ఉన్న అర్హతలు ఏంటి అంటే ఈ రోజుకీ ఆయన చంద్రబాబు కుమారుడు. ఈ రోజుకూ అదే పెద్ద అర్హత. లోకేష్ హఠాత్తుగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ గెలుపులో లోకేష్ పాత్ర ఏమీ ఉందని చర్చ కూడా ఉంది. అయితే మూడేళ్ళు గట్టిగా తిరగకుండానే ఆయన దొడ్డిదారిన అంటే ఎమ్మెల్సీగా ఎన్నిక అయి మంత్రి అయిపోయారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఇక విపక్షంలో ఉంటే నాయకత్వ లక్షణాలు గట్టిగా బయటకు వస్తాయి.
కానీ లోకేష్ తీరు చూస్తే ఆయన ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందనే అంతా అంటారు. ఆయన పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండవచ్చు కానీ ఆయన ఆయన టీడీపీ జనాల విశ్వాసమే ఇంకా ఎంతో పొందాల్సి ఉంది అన్న మాట కూడా ఉందని చెబుతారు. ఇలాంటి నేపధ్యంలో జనంతో పెద్దగా కనెక్షన్ ఏదీ లేకుండా భారీ ఉద్యమాలు చేయకుండా ఒకెసారి పాదయాత్ర అంటే లోకేష్ సాహసమే చేస్తున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో లోకేష్ నాయకత్వ లక్షణాల మీద పార్టీలో కూడా అందరికీ విశ్వాసం కలగాల్సి ఉంది. ఆ దిశగా లోకేష్ తనను తాను దిద్దుకోవాల్సి ఉంది. కానీ లోకేష్ ఆవేశంతో చేస్తున్నారా లేక సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా లేక చంద్రబాబు తరువాత తానే టీడీపీకి అసలైన పెత్తందారున్ని అని పార్టీ లోపలా బయటా చెప్పుకోవడానికి చేస్తున్నారా తెలియదు కానీ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు.
ఈ రోజున దేశంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఆయన కాంగ్రెస్ అగ్ర నేతగా ఉన్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. దేశంలో కీలక నాయకుడిగా ఎదిగారు. రాజకీయాల్లోకి వచ్చి పద్దెనిమిది ఏళ్ళు అయిన తరువాత ఆయన పాదయాత్ర అంటున్నారు. అందుకే ఆయన పాదయాత్రకు మద్దతు దక్కుతోంది. ఎందుకంటే ఆయన పేరు జనాలలో బాగా నలిగి ఉంది. రాహుల్ అంటే చాలా మందికి ఒక నాయకుడిగా తెలుసు కాబట్టి.
ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన 2009లో కాంగ్రెస్ ఎంపీ అయ్యారు. ఆ తరువాత అదే కాంగ్రెస్ ని ఎదిరించి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టారు. కడప నుంచి ఆయన అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2014లో ఆయన సొంతంగా తన పార్టీకు 68 మంది ఎమ్మెల్యేలను తొమ్మిది ఎంపీలను గెలిపించుకున్నారు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా పోరాటాలు చేసి 2017 చివరలో పాదయాత్ర చేశారు
ఇలా జనాల్లో ఒక బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని నాయకుడిగా ప్రూవ్ చేసుకుని పాదయాత్రకు దిగితే ఎవరికైనా భారీ స్థాయిలో ఆదరణ ఉంటుంది. లోకేష్ విషయానికి వస్తే ఇంకా ఆయనకు ఫ్యూచర్ ఉంది. ఈసారి ఆయన ఇతర నాయకులతో కలసి ఏపిలో కలియతిరిగి మీటింగ్స్ పెడుతూ జనాలలోకి వెళ్తే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉంది. కానీ సోలోగా పాదయాత్ర చేయడం ద్వారా సీఎం సీటు టార్గెట్ గా చేసుకుంటున్నారు అన్న భావన కలిగితే మాత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలనే అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ వర్గాల్లో ఈ న్యూస్ అయితే పెద్దగా ఆసక్తిని పెంచడంలేదు అనే చెబుతున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.