Begin typing your search above and press return to search.
బొకేలు.. బహుమతులు వద్దు.. ఏం తేవాలో చెప్పిన తమిళ సై
By: Tupaki Desk | 24 Dec 2019 5:26 AM GMTప్రముఖుల వద్దకు వెళ్లేవారు ఉత్త చేతులతో వెళ్లరు. తమతో ఏదో ఒక బహుమతి ని తీసుకెళతారు. కాదంటే.. పూల బొకేను అయినా తీసుకెళ్లటం మామూలే. తెలంగాణ రాజ్ భవన్ లో అడుగు పెట్టిన నాటి నుంచి తనదైన శైలిలో వ్యవహరిస్తున్న తమిళ సై.. ఇప్పుడు బహుమతు ల విషయం లోనూ క్లారిటీ ఇచ్చారు.
తన వద్ద కు వచ్చే వారు బహుమతులు.. బొకేలు తీసుకురావొద్దని.. బుక్స్ ను తీసుకురావాలన్నారు. తనకు పుస్తకాలు చదవటం ఎంత ఇష్టమన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. బుక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించేందుకు వెళ్లిన ఆమె ప్రసంగించారు. తన వద్దకు వచ్చేవారు బొకేలు.. బహుమతుల కు బదులుగా పుస్తకాలు తీసుకు రావాలన్నారు.
తనకు రోజు పుస్తకం చదవనిదే పొద్దు పొడవదని చెప్పిన ఆమె.. చిన్న వయసు నుంచే పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చేయాలన్నారు. తానీ కార్యక్రమానికి పుస్తకాల మీద అభిరుచి ఉన్న వ్యక్తిగా వచ్చినట్లు చెప్పటం విశేషం. ప్రతి ఏడాది హైదరాబాద్ మహా నగరం లో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈసారి కూడా అదే రీతిలో పుస్తక ప్రదర్శనను స్టార్ట్ చేశారు.
జనవరి ఒకటి వరకూ ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకూ ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం పన్నెండున్నరకే పుస్తక ప్రదర్శనను స్టార్ట్ చేస్తారు.