Begin typing your search above and press return to search.
తుమ్మల ప్లేస్ కు రీ ప్లేస్ లేదా ..!
By: Tupaki Desk | 9 Nov 2016 10:30 PM GMTపొలిటికల్ గా కొందరు నేతలకు ప్రజల్లో ఉండే బలం అంతా ఇంతాకాదు! వారికి సాటి మరొకరు ఉండరనే రేంజ్ లో ఉంటారు అలాంటి నేతలు. టీఆర్ ఎస్‌లో చేరి మంత్రి పదవిని కొట్టేసిన ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో పెనవేసుకుపోయిన తుమ్మల ఖమ్మంలో టీడీపీకి కంచుకోటనే నిర్మించారు. జిల్లాలో తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు. 35 సంవత్సరాలుగా ఆయన ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయిన నేపథ్యంలో తెలంగాణలోనూ టీడీపీ పుంజుకుంటుందని భావించారు.
అయితే, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆకర్ష్ దెబ్బకి టీ టీడీపీ నేతలు ఒక్కరొక్కరుగా జంప్ చేసి కారెక్కేస్తుండడంతో కూడికలు తీసివేతలు మారిపోయాయి. దీంతో ఇక, తాను ఒక్కడిని టీడీపీలో ఉండి చేసేది ఏమీలేదని భావించిన తుమ్మల .. ఓ ఫైన్ డే సైకిల్ దిగి కారెక్కేశారు. ఇది టీడీపీ తెలంగాణ శాఖకు బలమైన కుదుపు! ముఖ్యంగా ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన ఖమ్మంలో టీడీపీకి ఘనమైన పేరు తెచ్చిన నేత వెళ్లిపోవడం పెను పరిణామం. అయితే, మొదట్లో టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు దీనిని లైట్‌గా తీసుకున్నారు. రాజకీయంగా ఏవో రెండు విమర్శలు - మూడు ఆరోపణలు చేసేసి వదలేసుకున్నారు. మరింత బలంగా ఖమ్మంలో విస్తరిస్తామని అన్నారు.
అయితే, అలా అన్నారే కానీ.. బలంగా ఎదగడం అంటే.. అదికూడా తుమ్మలకు ప్రత్యామ్నాయంగా మరో నేతను నిలబెట్టడం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోందట ఎంతకష్టమో టీడీపీ అధినాయకత్వానికి! తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో కొత్త జిల్లాలకు పార్టీ కన్వీనర్లను ఎంపిక చేసే పనిలో పడ్డారు టీడీపీ అధినాయకులు. ఈ క్రమంలో పాత ఖమ్మంలో రెండు నూతన కన్వీనర్ పోస్టులు ఫిల్ చేయాలని భావించారు. కానీ.. సమర్ధుడైన తమ్ముడు దొరకక ఇబ్బందులు పడుతున్నారట. తుమ్మల రేంజ్ లో టీడీపీని నడిపించగల కొత్త నాయకుడు ఆ ఏరియాలోనే కనిపించడం లేదని టీటీడీపీ నేతలు వాపోతున్నట్టు సమాచారం.
ఇప్పుడు కన్వీనర్ పోస్టు ఫిల్లింగ్ కే ఇన్నిబాధలు పడుతుంటే.. 2019 ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏంటి? అని వారిలో వారే మదనపడుతున్నారట. ఇదిలావుంటే, ఖమ్మం నుంచి టీఆర్ ఎస్ లోకి జంప్ చేసిన తమ్మల మొన్నామధ్య జరిగిన ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చాటుకున్నారు. ఇక, ఇప్పుడు ఆయన 2019 ఎన్నికలపై దృష్టి పెట్టారు. తనను అనుసరించే టీడీపీ కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ కులాసాగా కారెక్కుంచుకుని ఖమ్మంలోని అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాలను గుండుగుత్తుగా గెలిచి.. తనకు తానే సాటి అని నిరూపించుకోవాలని మరింత దూకుడుతో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. తుమ్మలకు ఆ జిల్లాలో ఎదురు ఉండదు. ఈ పరిణామంతో తుమ్మల ప్లేస్ కి రీ ప్లేస్ లేదని టీడీపీలో సైతం చర్చలు జరుగుతున్నాయట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/