Begin typing your search above and press return to search.
ఆ నాలుగు పార్టీలకు అభ్యర్థులు కావలెను
By: Tupaki Desk | 10 Jan 2019 1:30 AM GMTకొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికల శంఖారావం మోగనుంది. ఈ ఎన్నికలు ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల పార్టీలకు ఇంకా గట్టి అభ్యర్థులే దొరకడం లేదంటే ఆయా పార్టీల పరిస్థితి ఎంతో దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా కోమాలోనే ఉంది. ఒకప్పుడు ఈ పార్టీకి ఏపీలో ఘనమైన చరిత్ర ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించడంతో ఆ పార్టీకి అక్కడి ప్రజలు ఘోరి కట్టారు. ఇప్పటీకీ ఆ పార్టీ తేరుకోలేకపోతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరకడం కష్టంగానే మారింది.
ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పరిస్థితి కాంగ్రెస్ లానే తయారైంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులేస్తున్న బీజేపీ పై అక్కడి ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. ఏపీ ప్రజలకు కనీసం రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడుగాలో తెలియని దుస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
ఇక వామపక్ష పార్టీల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దశాబ్దల చరిత్ర ఉన్నా ఆ పార్టీలు టీడీపీ కో లేక కాంగ్రెస్ కో తోక పార్టీల్లా మారిపోయాయి.. ఇక ఈ ఎన్నికల్లో రెండు పార్టీలను వదిలేసి కొత్తగా వచ్చిన జనసేనతో కలిసి నడుస్తామంటున్నాయి. ఈసారైనా వామపక్ష పార్టీలు నాలుగు సీట్లైనా దక్కుతాయో లేదా చూడాలి.
చివరగా జనసేన గురించి చెప్పుకోవాలి. కిందటి ఎన్నికల సమయానికి హడావుడిగా పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చారు. ఈసారి తాను ఒంటరిగా పోటీచేస్తానని ఒకసారి మరోవైపు వామపక్షాలతో కలిసి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇక జనసేనలో పవన్ మినహా ఎవరూ చెప్పుకోగదగిన నేతలు లేరు. కనీసం టీడీపీ, వైసీపీలోని కాపు నేతలు కూడా జనసేనలో చేరని పరిస్థితి ఉంది. దీంతో కొన్నిరోజులుగా వంగవీటి రాధా, బోండా ఉమ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరుతారని ప్రచారం చివరకు ప్రచారంగానే మిగిలింది.
ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఐదేళ్ల క్రితం వచ్చిన జనసేన పార్టీకి దశాబ్ధాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, బీజేపీ, విమపక్షాల పార్టీలకు పెద్ద తేడా ఏమి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చివరికి ఈ పార్టీలకు వైసీపీ, టీడీపీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలే దిక్కయ్యలా కనిపిస్తున్నాయి. గెలుపు విషయం దెవుడెరుగుగానీ కనీసం ఆ పార్టీలు అభ్యర్థులు నిలబెట్టుకొని పరువైనా దక్కించుకుంటాయో లేదో చూడాలి మరీ.