Begin typing your search above and press return to search.
షాక్ః హైదరాబాద్ లోని 98%ఏటీఎంలు ఖాళీ
By: Tupaki Desk | 14 Dec 2016 4:14 AM GMTకొత్త కరెన్సీకి కోటి తిప్పలు పడుతున్న వారికి మరో షాక్ లాంటి వార్త ఇది. పెద్ద నోట్ల రద్దు తరువాత 35 రోజులు గడిచిపోయిన తరువాత కూడా బ్యాంకులు - ఏటీఎంల వద్ద భారీ క్యూలు తప్పడం లేదు. హైదరాబాద్ నగరంలో 98శాతం ఏటీఎంలు పని చేయడం లేదని తాజాగా చేసిన ఓ సర్వేలో అనూహ్యమైన సమాచారం వెలువడింది.
కరెన్సీ నోట్ల రద్దు తరువాత ఏయే ఏటీఎంలలో డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని యాప్స్ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ఉపయోగించి ఏ నగరంలో ఏ ఏటీఎంల్లో డబ్బులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎక్కడి ఏటీఎంలో డబ్బులుంటే అక్కడికి వెళ్లవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ యాప్ ల మీద ఆధారపడ్డారు. అయితే యాప్ అందుబాటులో ఉంది, అందులో సొమ్ములు ఉన్నట్లుగా చూపించి తీరా అక్కడికి వెళ్లే సమయానికే ఖాళీ అయిపోతున్న పరిస్థితి ఎదురవుతోందట. ఇలా హైదరాబాద్ లో 98శాతం ఏటీఎంలు పని చేయడం లేదని, ఒకటి అరా ఏటీఎంలలో డబ్బులు ఉన్నా - భారీ క్యూలు తప్పడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు వరుస సెలవుల తరువాత సోమ - మంగళవారాలు బ్యాంకులు పని చేసినా భారీ క్యూలతో సతమతం అయ్యామని మండిపడుతున్నారు. వారానికి 24వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉన్నా - రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఈ సమస్యలు ఇంకెన్ని రోజులో అర్ధం కావడం లేదని ఖాతాదారులు వాపోతున్నారు.
మరోవైపు హైదరాబాద్ లోని పాత నగరంలో బ్యాంకుల వద్ద జనం సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రోజు కూలీపై బతికే వారు, చిన్న వ్యాపారులు నగదు లేక ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల ఖాతాదారులకు - బ్యాంకు ఉద్యోగులకు మధ్య ఘర్షణలు తప్పడం లేదు. పాత నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో బ్యాంకుల వద్ద పోలీసు భద్రతను పెంచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/