Begin typing your search above and press return to search.
కుకునూరు ఎస్ మరణంలో కొత్తకోణం
By: Tupaki Desk | 29 Jun 2017 4:34 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష.. కుకునూరు పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ కేసులకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఈ రెండు మరణాలకు.. సీసీ కెమేరాల ఫుటేజ్ కీలకంగా మారతాయని భావించారు. అయితే.. ఈ రెండు చోట్లా ఫుటేజ్ విషయంలో వెలుగు చూస్తున్న అంశాలు విస్మయాన్ని రేకెత్తిస్తున్నాయి.
కుకునూరుపల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన క్వార్టర్ లోనే ఆత్మహత్య చేసుకోగా.. ఆయనది హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ కెమేరాల ఫుటేజ్ ను పరిశీలించగా.. ఎస్ ఐ సూసైడ్ చేసుకున్న నాలుగో తేదీకి ముందు రోజు వరకూ మాత్రమే వీడియో ఫుటేజ్ ఉండటం పలు సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఫుటేజ్ మిస్ అయ్యిందా? లేక.. రికార్డు కాలేదా? అన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శిరీష మరణం కానీ.. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ ఉదంతంలోనూ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కీలకమైనది. అయితే.. ఈ స్టేషన్ లో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్ హార్డ్ డిస్క్ లో లేదన్న విషయాన్ని విచారణ అధికారులు గుర్తించారు. బ్యూటీషియన్ శిరీష మరణంలో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ప్రమేయం ఉందన్న భావనకు పోలీసులు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లోని వీడియో ఫుటేజ్ కీలకంగా మారనుంది. అయితే.. ఎస్ ఐ ఆత్మహత్య చేసుకున్న రోజు ముందు వరకు మాత్రమే రికార్డు కావటం.. తర్వాతి రోజు నుంచి ఫుటేజ్ హార్డ్ డిస్క్ లో లేకపోవటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికంగా చూస్తే.. హార్డ్ డిస్క్ లో ఏదైనా రికార్డు చేసినప్పటికీ.. వాటిని డిలీట్ చేసినప్పటికీ రిస్టోర్ చేసే వీలుంది. తాజాగా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ ఫుటేజ్ విషయంలో డిలీట్ కాలేదని.. అసలు రికార్డే కాలేదన్న మాట వినిపిస్తోంది. ఎస్ ఐ ఆత్మహత్య ముందు రోజు వరకూ మాత్రమే ఎందుకు రికార్డు అయ్యింది? ఆ తర్వాత ఎందుకు రికార్డు కాలేదన్న క్వశ్చన్ ఇప్పుడు వినిపిస్తోంది.
అదే సమయంలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన టీవీ.. ఎస్ ఐ తన క్వార్టర్‌కు మార్చుకోవటం ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తావిచ్చేలా ఉంది. ఎస్ ఐ క్వార్టర్ లో టీవీ ఉన్నప్పటికీ.. స్టేషన్లోని టీవీని ఎందుకు మార్చారన్న దానిపైనా పోలీసులు దృష్టి పెడుతున్నారు. మరోవైపు.. బ్యూటీషియన్ ఆత్మహత్య జరిగిన ఫోటో స్టూడియోలోనూ సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ.. అవేమీ రికార్డు కాలేదు. అన్నింటికి మించిన ఆసక్తికరమైన విషయం..రాజీవ్ బెడ్రూంలోనూ సీసీ కెమేరాలు ఉండటం. ఇన్ని కెమేరాలు ఉన్నప్పటికీ.. ఫుటేజ్ మాత్రం రికార్డు కాకపోవటం విశేషంగా చెప్పాలి. శిరీష.. కుకునూరు పల్లి ఎస్ ఐ మరణంలో కీలకమైన ఆధారాలు ఇచ్చే అవకాశం ఉన్న సీసీ కెమేరాలు రెండు చోట్లా ఉన్నప్పటికీ.. వాటి ఫుటేజ్ మాత్రం వివిధ కారణాలతో లేకపోవటం పోలీసుల్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/