Begin typing your search above and press return to search.

ఆరు రోజుల నుంచి బాదుడుకు మోడీ బ్రేక్

By:  Tupaki Desk   |   30 April 2018 7:24 AM GMT
ఆరు రోజుల నుంచి బాదుడుకు మోడీ బ్రేక్
X
ప‌న్నుల‌తో ప్ర‌జ‌ల న‌డ్డిని విర‌గ‌దీయ‌టంతో.. నొప్పి తెలీకుండా బాదేయ‌టంలో మోడీ తీరు వేరుగా ఉంటుంది. చేతిలో చాక్లెట్ పెట్టిన‌ట్లే పెట్టి.. జేబులో నుంచి నోట్ల‌ను లాగేసుకునే తీరులో మోడీ మాస్ట‌ర్ డిగ్రీనే తీసుకున్నార‌ని చెప్పాలి. త‌న‌కు ముందు ప్ర‌భుత్వాలు.. నెల‌కు రెండుసార్లు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గించ‌ట‌మా.. పెంచ‌ట‌మా అన్న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం.. దానికి త‌గ్గ‌ట్లే విప‌క్షాలు.. ప్ర‌జ‌లు రియాక్ట్ అయ్యేవారు.

ఇందుకు భిన్నంగా బాదుడు నొప్పి తెలీకుండా.. .భారం మాట నోటి వెంట రాని రీతిలో స‌రికొత్త విధానాన్ని అమ‌లు చేసి స‌క్సెస్ అయ్యారు మోడీ. ప్ర‌తి రోజు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని స‌మీక్షించి పెంచ‌ట‌మో.. త‌గ్గించ‌ట‌మో చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న త‌గ్గించ‌టం సంగ‌తి దేవుడెరుగు.. పెంచే ప‌ని మీద‌నే ఫోక‌స్ చేశారు.

మోడీ పుణ్య‌మా అని.. నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడు లేనంత భారీగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోయాయి. అత‌ర్జాతీయంగా బ్యారెల్ ముడిచ‌మురు 110 డాల‌ర్లు పైన ఉన్న‌ప్పుడు ఎంత ధ‌ర‌లు ఉన్నాయో.. ఇప్పుడు అంత‌ర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచ‌మురు 75 డాల‌ర్లు ఉన్న‌ప్పుడు అదే ధ‌ర‌ను చెల్లించాల్సి రావ‌టం చూస్తే.. ప్ర‌జ‌ల నుంచి ఎంత భారీగా మోడీ స‌ర్కారు బాదేస్తుందో ఇట్టే తెలుస్తోంది.

ఇటీవ‌ల కాలంలో అంత‌కంత‌కూ పెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు కొత్త రికార్డుల దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా గ‌డిచిన ఆరు రోజులుగా ఒక్క పైసా కూడా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచ‌లేదు. ఎందుకిలా? రోజుకు ఐదు పైస‌లో.. ప‌దిపైస‌లో.. లేదంటే పావ‌లానో పెంచేసే తీరుకు భిన్నంగా ఆరురోజులు బాదుడుకు రెస్ట్ ఇవ్వ‌ట‌మా? అన్న సందేహం క‌లుగుతున్న ప‌రిస్థితి.

ఎందుకిలా అని ఆలోచిస్తున్న వారికి.. క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో ధ‌ర‌ల్ని పెంచ‌కుండా జాగ్ర‌త్త‌ల్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. కీల‌క‌మైన క‌ర్ణాట‌కలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగితే క‌ష్ట‌మ‌న్న ఆలోచ‌న‌లో.. కొద్దిరోజుల పాటు రోజువారీగా ధ‌ర‌ల్ని స‌మీక్షించిన‌ట్లే స‌మీక్షించినా.. భారాన్ని మోపే ప‌ని మాత్రం చేయొద్ద‌ని సూచ‌న చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే గ‌డిచిన ఆరు రోజులుగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్లో మార్పులు లేవ‌ని చెబుతున్నారు. ఇంత‌కింతా అన్న‌ట్లు ఒక్క‌సారి క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ పూర్తి అయిన ప‌క్క రోజు నుంచి బాదుడు షురూ కానున్న‌ట్లు చెబుతున్నారు.